- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kids and Parenting : పిల్లల్లో చదువుపై ఆసక్తి తగ్గుతోందా..? ఈ లక్షణాలు గుర్తిస్తే బీ కేర్‌ఫుల్..!
పిల్లలు తరచుగా ఒకే దగ్గర కూర్చోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం, ఆటలాడటానికి ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారిలో కాల్షియం లోపం ఉండవచ్చు. అప్పుడేం చేయాలంటే..!

దిశ, ఫీచర్స్ : ఎనీ టైమ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే మీ పిల్లలు ఏదో తెలియని ఆందోళనకు గురవుతున్నారా? ముఖంలో తరచుగా డల్‌నెస్ కనిపిస్తోందా? చదువుపై ఏకాగ్రత కనబర్చడం లేదా? అయితే వారు 12 ఏండ్లలోపు వారైతే మీతో ఏమీ చెప్పకపోవచ్చు. కానీ పేరెంట్స్‌గా మీరే అర్థం చేసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా శరీరంలో కాల్షియం లోపంవల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.
*పిల్లలు తరచుగా ఒకే దగ్గర కూర్చోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపడం, ఆటలాడటానికి ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారిలో కాల్షియం లోపం ఉండవచ్చు. దీనివల్ల బలహీనత ఆవహించి అలా చేస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, జలదరింపు, నొప్పి, చర్మంపై తెల్లటి మచ్చలు వంటివి కూడా కాల్షియం లోపం ఉందనడానికి సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. చల్లని వెదర్ కారణంగా వర్షాకాలంతో తగినంత ఆహారం తీసుకోకపోవడంవల్ల పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు.
* కొందరు పిల్లలు దంత సమస్యలు, ముఖ్యంగా చిగుళ్లలో నిప్పితో ఇబ్బంది పడుతుంటారు. కానీ దాని గురించి అవగాహన లేకపోవడంవల్ల పేరెంట్స్‌కి చెప్పకపోవచ్చు కూడా. ఏదో నొప్పిగా ఉందని చెప్పేస్తుంటారు. కానీ కొన్నిసార్లు పేరెంట్స్ పట్టించుకోరు. క్రమంగా అది తీవ్రమైన సమస్యగా మారవచ్చు. దంతాల్లో సమస్య ఉంటే పిల్లలు తిండి సరిగ్గా తినరు. క్రమంగా ఎముకలు, దంతాలు బలహీన పడే అవకాశం ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపవంవల్లే దాదాపు ఇలా జరుగుతుంది. అలాగే నోటి పరిశుభ్రత పాటించకుంటే కూడా ‘పీరియంటల్ డిసీస్’ అనే చిగుళ్ల వ్యాధి రావచ్చు.
* సహజంగానే పిల్లలు త్వరగా నిద్రపోతారు. కానీ అర్ధరాత్రిళ్లు కూడా వారు మేల్కొంటున్నారంటే అనుమానించాల్సిందే. కాల్షియం లోపంవల్ల కూడా ఇలా జరుగుతుంది. దీంతో నీరసంగా, బలహీనంగా మారుతారు. బద్ధకం, అలసట వేధిస్తాయి. నిద్రలేమిని ఎదుర్కొంటుంటారు.
*చేతులు, చేతి గోళ్లు ఎల్లో కలర్‌లోకి మారిపోతే కూడా అది కాల్షియం లోపం లక్షణాలేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో పిల్లల గోళ్లు బలహీనంగా మారడం, పాలిపోవడం, ముక్కలుగా విరుగుతూ రాలిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే జుట్టు రాలడం, చర్మంపై దద్దుర్లు, దురద వంటివి కూడా పిల్లల్లో కాల్షియం లోపంవల్ల తలెత్తే సమస్యలుగా ఉంటాయి.
* చదువుపై ఏకాగ్రత కుదరకపోవడం, చదివినా గుర్తుండకపోవడం, కొద్దిసేపు కూర్చోగానే అలసి పోవడం వంటి లక్షణాలు సైతం పిల్లల్లో కాల్షియం లోపాన్ని సూచిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే ‘హైపోకాల్సెమియా’ వ్యాధిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, భ్రమలకు లోనవడం, మతిమరుపు, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే కాల్షియం లోపాన్ని అధిగమించాలి. అందుకోసం పాలు, పెరుగు, ఆకూ కూరలు, బాదం, జీడిపప్పులు, పిస్తా, గుమ్మడి గింజలు, రాగులు, కొమ్ము శనగలు, చేపలు, బీన్స్, వేరు శనగలు వంటివి ఆహారంలో భాగంగా చేర్చి పిల్లలకు ఇవ్వాలంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






