- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: గాల్లో ఎగురుతున్న బస్సులు.. వీడియో చూస్తే షాకవ్వాలసిందే!
నెట్టింట మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది

దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకీ టెక్నాలజీ మారుతుంది. ఈ రోజు ఒకటి ఉంటే .. దానిని కొన్ని రోజుల తర్వాత అప్డేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు న్యూస్ ల్లో కూడా వస్తుంటాయి. అలాగే, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు .. ప్రపంచం మొత్తం అరచేతిలోనే చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిలో కొన్ని బాగా వైరల్ ( Viral ) అవుతుంటాయి. ఇక, టెక్నాలజీకి సంబంధించినవి అయితే ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది.
బస్సులు గాల్లోకి ఎగురుతున్నాయి. 2050 నాటికీ టెక్నాలజీ చాలా మారిపోతుందని టెక్ నిపుణులు తెలిపారు. రెక్కలు అమర్చిన బస్సులు పక్షి ఎగిరినట్టు , గాల్లోకి ఎగిరి మళ్ళీ రోడ్ మీదకు వస్తున్నాయి. ఇది చూడటానికి చాలా వింతగా ఉంది. " ముందు ముందు భవిష్యత్తులో ఎగిరే బస్సు ( Bus ) ప్రయాణం సులభంగా చేయొచ్చు.. ట్రాఫిక్ జామ్‌ల ఇబ్బంది పడకుండా ఉండేందుకు పెద్ద డేటాతో రూట్‌లను ప్లాన్ చేయడానికి అనుమతిస్తుంది అలాగే ఇది వాహనం వేగాన్ని పెంచుతుంది " పోస్టులో రాసుకొచ్చి వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటివి వస్తే మంచిదని కొందరు, ఇలాంటివి రావడం అసాధ్యం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.






