- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: పవన్ కల్యాణ్‌పై MLC కవిత వివాదాస్పద వ్యాఖ్యలు.. రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్న డిప్యూటీ CM ఫ్యాన్స్
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో కవితను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు. అనుకోకుండా పవన్ కల్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెనుదుమారమే రేపాయి.
దీంతో కవితపై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. పవన్ ను కించపరిచేలా ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కవితను ఓ రేంజ్ లో ఉతికారేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీడియోలను వైరల్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కవిత అరెస్ట్ అయినప్పటి వీడియోలను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. సీరియస్ పొలిటిషియన్ అంటే ఇలా స్కామ్స్ చేసి అరెస్టు కావడం కావచ్చు అంటూ సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్ , అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ అధికారాన్ని కోల్పోయాయని చెబుతున్నారు.
కేసీఆర్ కూతురిగా రాజకీయాలతో నెట్టుకువస్తున్న కవిత..ఎమ్మెల్సీ అయ్యారని పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని జనసైనికులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు స్పందించారు. పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయవచ్చు కానీ ఫలానా నాయకుడికి డిప్యూటీ సీఎం అయ్యేంత సీన్ లేదని ఆయనకు అనుకోకుండా ఆ పదవి వరించిందంటూ అనడం ఏమాత్రం సబబు కాదని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు సీరియస్ పొలిటిషియన్ అంటే కవిత ద్రుష్టిలో ఎవరో చెప్పాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద కవిత ఏరికోరి జనసైనికులతో ఏరికోరి ట్రోలింగ్ కు గురవుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






