- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్ : పెళ్లంటే జీవితంలో అదొక అద్భుతమైన సందర్భం అంటుంటారు పెద్దలు. అందుకే అంగ రంగ వైభవంగా చేయాలని మరికొందరు భావిస్తుంటారు. ఇక పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం గురించి కూడా పాజిటివ్, నెగెటివ్ అంశాలను తమ తమ కోణంలో విశ్లేషిస్తుంటారు ఇంకొందరు. చేసుకుంటే ఫలానా విధంగా చేసుకున్నారని, ఫలానా సంప్రదాయం పాటించలేదని కొందరు, కులం, మతం, ప్రాంతం పేరుతో కూడా మరికొందరు రకరకాల చర్చలు, వాదనలు చేస్తుంటారు. కానీ ఆధునిక కాలంలో వాటన్నింటికీ కాలం చెల్లిందని, నేటి యువత స్మార్ట్‌గా ఆలోచిస్తోందని ప్రముఖ నటి, రాజ్య సభ సభ్యురాలు జయాబచ్చన్ అంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ‘వీ ది వుమెన్’ (We The Women) ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్ ఈ సందర్భంగా ఆమెను తన మనవరాలు నవ్య నవేలి నందా వివాహం గురించి సరదాగా అడిగినప్పుడు.. జయా బచ్చన్ సాధారణంగానే స్పందించారు. “నవ్యకు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. అయినా ఈ రోజుల్లో పెళ్లి అనేది ‘‘outdated institution” అంటూ ఆసక్తికర వ్యఖ్యాలు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీశాయి. ఇంతకీ జయాబచ్చన్ ఏమన్నారంటే..
వివాహం అంటే దానిని ఏదో బ్రహ్మ పదార్థంలా చూడాల్సిన అవసరం లేదు. కలిసి జీవించడానికి తీసుకునే నిర్ణయం. దానిని యువత తమ ఇష్టప్రకారం సింపుల్‌గా కూడా కొనసాగించవచ్చు. ఒకప్పటిలా ఫలానా విధంగానే పెళ్లి చేయాలని, ఉద్యోగాలు చేయకూడదని, ఫలానా సంప్రదాయమే పాటించాలని నేటి యువత ఆలోచించడం లేదు. కుల, మతాల గురించి ఆధునిక యువత పట్టించుకోదు. వారికి కావాల్సిందల్లా కంఫర్ట్ రిలేషన్‌షిప్. పైగా పెళ్లిని ఫలానా కోణంలో ఒక చట్టపరమైన సంబంధంగా నిర్వచించాల్సిన అవసరం లేదు. చేసుకోబోయే ఇద్దరికీ, ఇరు కుటుంబాలకూ ఇష్టమైతే చాలు.. ఫలానా విధంగానే పెళ్లి తంతు జరపాలని ఏమీ లేదు. ఏ హడావిడీ లేకుండా కూడా సంబంధం కొనసాగించవచ్చు. పిల్లల్ని కనవచ్చు అని పేర్కొన్న జయా బచ్చన్ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని యువతకు లసహా ఇచ్చారు. ‘పెళ్లి అనేది బలవంతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ కుదిర్చేది కాదు. అది సంబంధంలో సానుకూలతను, స్వేచ్ఛ, స్వతంత్రతలను ప్రోత్సహించేలా ఉండాలి. ముఖ్యంగా మహిళల విషయంలో అది జరిగినప్పుడే మహిళా సాధికారతకు అవకాశం ఉన్నట్లు’ అని పేర్కొన్న జయాబచ్చన్ మెరుగైన సామాజిక మార్పునకు ఇలాంటివి దోహదం చేస్తాయని తెలిపారు. కాగా ప్రస్తుతం జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పలువురు ఆసక్తికరంగా తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అనేకమంది పెళ్లి విషయంలో ఔట్ డేటెట్ భావాలు లేదా ఔట్ డేటెట్ ఇన్‌స్టిట్యూషన్ (outdated institution) పద్ధతులు మారాల్సిన అవసరం ఉందన్న జయా బచ్చన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. మరికొందరు భిన్నమైన అభిప్రాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. Link






