యువకుడిలా కనిపించడం కోసం ఏకంగా సొంత కుమారుడి రక్తాన్నే..?

by Disha Web Desk 9 |
యువకుడిలా కనిపించడం కోసం ఏకంగా సొంత కుమారుడి రక్తాన్నే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనిపించాలనే ఆకాంక్ష ఉంటుంది. అందుకోసం కొంతమంది చిట్కాలు పాటించడం, వ్యాయామం చేయడం, మరికొంతమంది మంచి ఫుడ్ తీసుకోవడం లాంటివి చేస్తారు. కానీ ఓ వ్యక్తి యవ్వనంగా కనిపించడం కోసం ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే.. జాన్సన్ అనే 45 ఏళ్ల వ్యక్తి.. 18 సంవత్సరాల అబ్బాయిలా కనిపించడం కోసం ఏకంగా సొంత కుమారుడి (టాల్మేజ్) రక్తాన్నే వాడుకున్నాడు. జాన్సన్ తన శరీరంలోని గుండె, ఇతర అవయవాలతో పాటు తన లుక్స్, పురుషాంగం ప్రతి అవయవం.. 18 ఏళ్ల యువకుడి మాదిరిలా ఉండాలని భావిస్తున్నాడు.

ఇందుకోసం అతడు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడు. అలాగే చాలా కాలం నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న అతడికి బ్లెడ్ అవసరమైనప్పుడల్లా ఎవరిదో ఒకరిది రక్తం తీసుకునేవాడు. కానీ తాజాగా తన కుమారుడి రక్తాన్నే తీసుకోవడం మొదలుపెట్టాడు. దానికి టాల్మేజ్ హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఈ విధంగా సేకరించిన రక్తాన్ని కొన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసి, ఆ తర్వాత ద్రవ ప్లాస్మా, మరొకటి ఎరుపు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లుగా విడగొడతారట. అనంతరం ప్లాస్మాన్ని జాన్సన్‌కు ఎక్కిస్తారట. దాదాపు 30 మంది డాక్టర్స్ ప్రతి నిమిషం తనకు చికిత్స అందించడానికి అందుబాటులో ఉంటారట. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Read More: ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్‌‌‌కు ఏది కారణం..?



Next Story

Most Viewed