ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు.. కిడ్నీ, లివర్‌లను డ్యామేజ్ చేస్తాయా?

by Javid Pasha |

ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి ఉల్లిపాయలను తింటే కిడ్నీ, లివర్ డ్యామేజ్ కావచ్చు!

ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు.. కిడ్నీ, లివర్‌లను డ్యామేజ్ చేస్తాయా?
X

దిశ, ఫీచర్స్ : ఇంట్లో ఉల్లిపాయలు నిల్వ ఉంచినప్పుడో, వాటిని తరుగుతున్నప్పుడో పైపొరపై నల్లటి బూడిద లేదా బూజు వంటి భాగం కనిపిస్తున్నదా? అయితే బీకేర్ ఫుల్. ఇలాంటి ఉల్లిగడ్డలను వంటకు ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే.. అదొకరకమైన ఫంగస్. కొన్ని సందర్భాల్లో ఇది మైకోటాక్సిన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆహారంగా తీసుకోవడంవల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వొచ్చుని, లేదా ఇతర అనారోగ్యాలు సంభవించవచ్చునని హెచ్చరిస్తున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఇంకా ఏయే ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు కేవలం ధూళి, దుమ్ము, మట్టి వంటివి కాకపోవచ్చు. ఇవి చాలా సాధారణంగా ఆస్పెర్జిల్లస్ నైగర్ (Aspergillus niger) అనే ఫంగస్ వల్ల వస్తాయి. ఈ ఫంగస్ తేమ, వేడి వంటి వాతావరణంలో బాగా వృద్ధి చెందుతుంది. ఉల్లిపాయలు పండించే సమయంలో లేదా నిల్వ చేసినప్పుడు వాటిపై గాయాలు లేదా తేమ ఉన్నచోట్ల ఇది సులభంగా వ్యాపిస్తుంది. దీంతో ముందుగా బయటి పొరపై నల్లటి బూజు (మసి పూసినట్టుగా) లేదా గీతలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఆ ఉల్లిపాయలను వాడకూడదు. ఇలాంటి ఉల్లిపాయలను నిరంతరం లేదా ఎక్కువ మొత్తంలో వాడితే లివర్, కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు, ఫంగస్ అలర్జీ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అందుకే ఫంగస్ (నల్లటి బూజు) ఉన్న ఉల్లిపాయలను వాడకూడదు. ఒకవేళ తప్పనిసరి వాడాల్సి వస్తే నల్లటి మచ్చలు ఉన్న బయటి పొరమొత్తాన్ని తొలగించి ఉపయోగించాలి. కాకపోతే అలాంటి ఉల్లిపాయలు ఉపయోగించకపోవడమే సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఏం జరుగుతుంది?

లివర్, కిడ్నీలపై ప్రభావం :నల్లటి మచ్చలు ఆస్పెర్జిల్లస్ నైగర్ అనే ఫంగస్ వల్ల ఏర్పడతాయి. ఇది ఒక్రాటాక్సిన్ A (OTA), ఫ్యూమోనిసిన్ B2 (FB2) వంటి విషపూరితాలను(Mycotoxins) విసర్జిస్తుంది. ఎక్కువ మొత్తంలో లేదా దీర్ఘకాలం తీసుకుంటే కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు)కు హాని కలగవచ్చు. దీర్ఘకాలికంగా లివర్ స్ట్రెస్, ఫెయిల్యూర్ లేదా క్యాన్సర్ ప్రమాదం పెరగవచ్చు.

*శ్వాసకోశ సమస్యలు: స్పోర్స్ (బూజు రేణువులు) ఊపిరితిత్తుల్లోకి చేరితే అలర్జీలు, ఆస్తమా ఎక్స్‌సర్‌బేషన్, అలర్జిక్ బ్రాంకోపల్మనరీ(Allergic bronchopulmonary), ఆస్పెర్జిల్లోసిస్ (ABPA) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తమా ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు, డయాబెటిక్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలి.

*ఇతర సమస్యలు: నల్లమచ్చలు కలిగిన ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా వాడినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవ్వొచ్చు. దీంతో వాంతులు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

పరిష్కారం ఏమిటి?

నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయను ముందు బాగా పరిశీలించండి. అది ఫంగస్ ఫంగస్ అయితే గనుక వాడకపోవడం మంచిది. తప్పనిపరిస్థితిలో వాడాల్సి వస్తే.. మచ్చలు కేవలం బయటి పొరపై ఉన్నప్పుడు మాత్రం ఆ పొరను పూర్తిగా తీసేసి, లోపలి భాగం గట్టిగా, తాజాగా ఉంటే ఉపయోగించవచ్చు. అలా కాకుండా ఉల్లిపాయ మెత్తబడి, వాసన వస్తే లేదా మచ్చలు లోపలికి వ్యాపించి ఉంటే ఏమాత్రం ఉపయోగించ కూడదు. ఇక నివారణ చర్యల విషయానికి వస్తే.. ఉల్లిపాయలను కొన్నప్పుడు పరిశీలనగా చూసి కొనండి. ఇంట్లో ఎండగా, చల్లగా, గాలి తగిలే చోట నిల్వ చేయండి. వాడేముందు ఉప్పునీరు లేదా వెనిగర్ నీటితో శుభ్రం చేసి, బాగా కడగండి. ఇలా చేయడం వల్ల సూక్ష్మక్రిములు తగ్గి, ఆహార భద్రత మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తాజా ఉల్లిపాయలు కొని వాడటం మంచిదని సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story