- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీసెస్‌తో చాట్ చేయొచ్చు.. దేవుడు మీకు రిప్లయ్ ఇస్తాడు.. వైరల్ న్యూస్
ChatGPT నుంచి వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ వరకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

దిశ, ఫీచర్స్: ChatGPT నుంచి వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ వరకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని అద్భుతమైన చాట్బాట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజా AI-ఆధారిత యాప్ నిస్సందేహంగా వీటికన్నా చాలా విచిత్రమైనది అంటున్నారు నిపుణులు. ‘టెక్స్ట్ విత్ జీసస్’ అని పిలువబడే ఈ యాప్.. బైబిల్లోని ప్రసిద్ధ వ్యక్తులతో లోతైన సంబంధాన్ని కోరుకునే క్రైస్తవుల కోసం రూపొందించబడినట్లు చెప్తున్నారు. వినియోగదారులు జీసస్‌తో పాటు మేరీ, జోసెఫ్, పీటర్, మాథ్యూతో సహా అనేక ఇతర వ్యక్తులతో చాట్ చేయవచ్చు. అయితే వినియోగదారులు ఇందుకోసం రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.
‘టెక్స్ట్ విత్ జీసస్’ అనేది కింగ్ జేమ్స్ వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్‌తో సహా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న అన్ని బైబిల్ వెర్షన్లపై శిక్షణ పొందన ఏఐ బేస్డ్ యాప్. Apple iMessage యాప్‌ని పోలి ఉండే చాట్ ఫంక్షన్ ద్వారా వినియోగదారులు తను ఎంపిక చేసుకున్న వ్యక్తితో చాట్ చేయవచ్చు. అయితే ఈ యాప్ వాస్తవమైన దైవిక అంతర్దృష్టులను అందించడానికి లేదా దైవిక స్పృహను కలిగి ఉందని క్లెయిమ్ చేయదు. కానీ బైబిల్, మతపరమైన గ్రంథాల ఆధారంగా ప్రతిస్పందనలను రూపొందించడానికి దాని భాషా నమూనాను ఉపయోగిస్తుంది. ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజ్ క్రియేట్ చేయడం, మతపరమైన గ్రంథాలపై లోతైన అవగాహన, విశ్వాసం గురించి అర్థవంతమైన సంభాషణలను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు.. ‘పనిలో నేను ఇతరుల పట్ల ఎలా దయ చూపగలను?’ అని అడిగినప్పుడు.. AI యేసు ఇలా ప్రతిస్పందించాడు. ‘కాబట్టి ప్రతి విషయంలోనూ, ఇతరులు మీకు ఏమి చేయాలనుకుంటున్నారో వారికి చేయండి. ఇది ప్రవక్తల ధర్మశాస్త్రాన్ని సంగ్రహిస్తుంది(మత్తయి 7:12)’ అని చెప్తాడు.
Read More: యూట్యూబర్స్కు షాక్.. హెల్త్ వీడియోలకు చెక్ పెట్టేలా యూట్యూబ్ సంచలన నిర్ణయం






