- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జననం
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ రచయిత, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి) రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు 1916 జూన్ 10న జన్మించారు.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ రచయిత, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి) రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు 1916 జూన్ 10న జన్మించారు.నల్గొండ జిల్లా అన్నెపర్తికి చెందిన ఈయన తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో నిష్ణాతులు. కాగా 1962లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ రచనను పూర్తిచేశారు. అయితే భారత్-చైనా యుద్ధం తర్వాత చైనా తమ దేశ ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి నూరిపోయాలని, దీనికోసం ప్రత్యేకంగా దేశభక్తి గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది. కాగా అప్పటికే విదేశీ భాషల్లో ప్రావీణ్యం పొందిన పైడిమర్రి ఈ విషయాన్ని గుర్తించి మన దేశ విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో తనే స్వయంగా ఈ రచనను పూర్తి చేశాడు. దీన్ని తెన్నేటి విశ్వనాథం సాయంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు. ఇలా 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశంలో ఈ రచనను జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. కాలక్రమంలో దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదివిస్తున్నారు.






