పక్షులను గమనించే అలవాటుతో పెరుగుతున్న జ్ఞాపక శక్తి.. ఇంకా ఆ ప్రయోజనాలు కూడా!

by Javid Pasha |   (  Updated:2026-03-26 08:34:13  IST  )

బర్డ్ వాచింగ్ కేవలం కాసేపటి సంతోషానికే పరిమితం కాదు, అది మీ మెదడుకు ఊహించిన ప్రయోజనాలను కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

పక్షులను గమనించే అలవాటుతో పెరుగుతున్న జ్ఞాపక శక్తి.. ఇంకా ఆ ప్రయోజనాలు కూడా!
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతిలో గడపడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే కెనడియన్ న్యూరోసైన్స్ నిపుణుల తాజా అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. పచ్చని చెట్లపై, ఇంటి పరిసరాల్లో ఇలా ఎక్కడైనా సరే.. పక్షులను గమనించడం, వాటి కిలకిల రావాలు వినడం మెదడు ఆరోగ్యానికి మెరుగు పరుస్తుందని, జ్ఞాపక శక్తిని పెంచుతుందని తెలిపింది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బర్డ్ వాచింగ్ కేవలం కాసేపటి సంతోషానికే పరిమితం కాదు, అది మీ మెదడుకు ఊహించిన ప్రయోజనాలను కలిగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. క్రమం తప్పకుండా పక్షులను గమనిస్తూ గడిపేవారిలో శ్రద్ధ (attention), జ్ఞాపక శక్తి, ప్యాటర్న్ గుర్తింపు (pattern recognition) వంటి మానసిక ప్రక్రియలు ఉత్తేజితం అవుతాయని చెబుతున్నారు. స్టడీలో భాగంగా పరిశోధకులు తరచుగా పక్షులను చూస్తూ, వాటి కిలకిల రావాలను ఆస్వాదించేవారి మెదడు పనితీరును విశ్లేషించగా, శ్రద్ధ, దృశ్య గ్రహణం (visual perception) & వర్కింగ్ మెమరీ మరింత మెరుగుపడినట్లు గుర్తించారు.

పక్షులను గమనించే అలవాటు మానవుల్లో మెదడు న్యూరోప్లాస్టిసిటీని పెంచి, కాగ్నెటివ్ సామర్థ్యాలను కూడా మెరుగు పరుస్తుందని ఈ సందర్భంగా పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రకృతితో ముడిపడి ఉండటంవల్ల ఫోకస్, ఆసక్తి, నేర్చుకునే సామర్థ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా మూడ్ మెరుగుపడటం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతాయి. మానసిక ఆనందం, ఏకాగ్రత పెరుగుతాయి. ఇవన్నీ మెదడు సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా పరోక్షంగా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధ్యయనం పేర్కొన్నది.

Next Story