Bird flu: మనుషులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-02 02:45:45  IST  )

బర్డ్ ఫ్లూ (Bird flu) అనేది ప్రధానంగా పక్షులలో కనిపించే ప్రమాదకరమైన వైరస్.

Bird flu: మనుషులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
X

దిశ, వెబ్ డెస్క్: బర్డ్ ఫ్లూ (Bird flu) అనేది ప్రధానంగా పక్షులలో కనిపించే ప్రమాదకరమైన వైరస్. చాలా అరుదైన సందర్భాల్లో మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. అయితే, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) బర్డ్ ఫ్లూ కేసులు బయటపడటం, ఏపీలో (AP) రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి మరణించటంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కవయ్యాయి. ఈ సందర్భంగా ఈ వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

బర్డ్ ఫ్లూ వైరస్‌తో చనిపోయిన లేదా సోకిన పక్షులను, కోళ్లలను తాకడం, వాటి వ్యర్థాలతో కలుషితమైన ఉపరితలాలు లేదా వస్తువులను తాకడం వల్ల మనుషులకు ఈ వైరస్‌ సోకుతుంది. ఇది మనుషులకు సోకితే 3 నుంచి 5 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఇక బర్డ్ ఫ్లూ లక్షణాలు చాలా వరకూ సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. అయితే ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో కళ్లకు ఇన్ఫెక్షన్ తోపాటు వికారంగా ఉండడం, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పి, గొంతు మంట లేదా నొప్పి, ఫీవర్ వంటివి ప్రధానంగా కనిపించవచ్చు. వైరస్ సోకిన వారిని వెంటనే వైద్యుల సలహా మేరకు క్వారంటైన్‌లో ఉంచాలి. లేదంటే మరొకరికి బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

* పౌల్ట్రీ ఫామ్, కోళ్ల మార్కెట్‌లలో ఉండే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

* జబ్బు పడిన పక్షులు, కోళ్లు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.

* చేతులు తరచుగా సబ్బుతో కడగాలి. కచ్చితంగా ఆరోగ్య సూచనలు పాటించాలి.

* కోడిమాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించిన తర్వాతే తినాలి.

* వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలి.

* స్వచ్ఛమైన, రుచి పరిమితి తగిన మాంసాన్ని మాత్రమే తీసుకోవాలి.

* జ్వరంతో పాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* కొవిడ్‌ సమయంలో మాదిరిగా తరచూ ఆక్సిజన్‌ స్థాయిలను పరిశీలించుకోవాలి.

* బర్డ్‌ ఫ్లూ వ్యాధికి నివారించడానికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన వ్యాక్సిన్‌ లేనందున్న జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.


Read More..

Bird Flu ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి

Next Story