Bird Flu ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-02 02:19:05  IST  )

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో బర్డ్‌ఫ్లూ (Avian influenza/H5N1) బారినపడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

Bird Flu ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో బర్డ్‌ఫ్లూ (Avian influenza/H5N1) బారినపడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాలయ్యనగర్‌కు చెందిన పెండ్యాల జ్యోతి (2) బర్డ్‌ఫ్లూతో మరణించినట్లుగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం రాత్రి నిర్ధారించారు. అయితే, జ్యోతి గత నెల 4న అనారోగ్యానికి గురైంది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు మార్చి 4న మంగళగిరి (Mangalagiri)లోని ఎయిమ్స్‌ (AIMS)కు తీసుకొచ్చారు.

వైద్యులు బాలికకు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందజేసినా పరిస్థితి చేదాటిపోయింది. దీంతో మార్చి 16న జ్యోతి మృతి చెందింది. అయితే, చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్‌ నమూనాలను ఎయిమ్స్‌ (AIMS)లోని వీఆర్‌డీఎల్‌ (VRDL)లో పరీక్షించగా ఇన్‌ఫ్లుయెంజా ఏ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించగా రిపోర్టు అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్‌ (ICMR) మార్చి 24న స్వాబ్‌ నమూనాలను పుణె (Pune)లోని ఎన్‌ఐవీ (National Institute of Virology)కి పంపించింది. ఈక్రమంలోనే జ్యోతికి హెచ్‌5ఎన్‌1 వైరస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయింది.

Next Story