- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bihar: లోన్ రికవరి ఏజెంట్‌తో లవ్‌లో పడ్డ మహిళా.. భర్త ఏం చేశాడంటే?
Bihar: భర్త తాగుబోతు అయితే ఆ ఇల్లాలు కష్టాలు మామూలుగా ఉండవు.

దిశ, వెబ్‌డెస్క్: Bihar: భర్త తాగుబోతు అయితే ఆ ఇల్లాలు కష్టాలు మామూలుగా ఉండవు. కొందరు తాగి వచ్చి భార్యలను తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు తాగుబోతు భర్తలు పెట్టే టార్చర్ భరించలేక భార్యలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇంకొందరు మహిళలు అయితే ఏకంగా భర్యను హత్య చేసిన ఘటనలూ ఉన్నాయి. చాలా వరకు కేసుల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. కొందరు ఏం చేస్తారంటే తమ భర్తలను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు వీడు నాకు వద్దు బాబోయ్ అని వదిలేసి వెళ్తారు. కానీ తాజాగా ఘటన చూస్తే మీరు షాక్ అవుతారు.
తాగుబోతు భర్త వేధింపులు భరించలేక లోన్ రికవరీ ఏజెంట్ ను ప్రేమించి వివాహం చేసుకుంది ఓ మహిళ. మద్యానికి బానిసై భర్త పెట్టే బాధలతో విసిగిపోయి తమ ఇంటికి వచ్చే లోన్ ఏజెంట్ ను ప్రేమించింది. చివరకు అతడి కలిసి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. ఇంద్రకుమారికి 2022లో బీహార్ లోని జముయ్ జిల్లాలోని కర్మటాండ్ గ్రామానికి చెందిన నకుల్ శర్మతో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన నకుల్ ఇంద్రకుమారిని టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా, మానసికంగా వేధింపులున భరించలేక ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
ఈ సమయంలోనే జాజల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి అయిన పవన్ కుమార్ యాదవ్ పరిచయం అయ్యింది. పవన్ కుమార్ బ్యాంకు ఇచ్చిన లోన్లను రికవరీ చేసే ఏజెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను కర్మటాండ్ గ్రామానికి కూడా వెళ్లి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకుమారి, పవన్ కుమార్ యాదవ్ కు కాస్త పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ తో కలిసి పారిపోయింది. ఫిబ్రవరి 4న వారు ఫ్లైట్ లో పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ కు చేరుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత ఫిబ్రవరి 11న ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ హిందూ ఆచారాలతో జరిగిన వీరి వివాహానికి చాలా మంది హాజరయ్యారు. ఈ వివాహాన్ని పవన్ కుమార్ కుటుంబం అంగీకరించింది. కానీ ఇంద్రకుమారి కుటుంబం మాత్రం ఈ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.






