వేలెడంతా కూడా లేని ఈ బుడ్డోడి గట్స్‌కు హ్యాట్సాఫ్.. ఎన్నిసార్లు పడినా అస్సలు తగ్గకుండా.. (వీడియో)

by Sujitha Rachapalli |

పిల్లలు క్విక్ లర్నర్స్. ప్రతీది చాలా తొందరగా క్యాచ్ చేస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారని చెప్తారు నిపుణులు. కానీ ఈ వీడియో చూస్తే పిల్లల నుంచి కూడా

వేలెడంతా కూడా లేని ఈ బుడ్డోడి గట్స్‌కు హ్యాట్సాఫ్.. ఎన్నిసార్లు పడినా అస్సలు తగ్గకుండా.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : పిల్లలు క్విక్ లర్నర్స్. ప్రతీది చాలా తొందరగా క్యాచ్ చేస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారని చెప్తారు నిపుణులు. కానీ ఈ వీడియో చూస్తే పిల్లల నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. అప్పుడప్పుడే నడక నేర్చుకున్న బుడ్డోడు.. ఓ బెంచ్ ఎక్కాలని టార్గెట్ పెట్టుకున్నడు. కింది నుంచి సోఫా మీదకు ఎక్కి అక్కడి నుంచి ఆ బల్ల మీదకు ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. పడిపోతునే ఉన్నాడు. కానీ ఎన్నిసార్లు పడినా మళ్లీ లేచి ట్రై చేస్తునే ఉన్నాడు. ఫైనల్‌గా టేబుల్‌ మీదకు ఎక్కి సాధించాననే ఓ విన్నింగ్ లుక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఇది చూసిన జనాలు ఫిదా అయిపోతున్నారు. బెస్ట్ మోటివేషనల్ వీడియో అనే క్యాప్షన్‌తో పోస్ట్‌లు పెడుతున్నరు. ఎప్పుడైనా లైఫ్‌లో పడిపోయినట్లు అనిపిస్తే ఇదే వీడియో చూస్తానని కొందరు అంటుంటే.. నిజంగా డైహార్డ్ ఫ్యాన్ అయిపోయామని ఇంకొందరు అంటున్నారు. ‘జీవితంలో పాజిటివ్‌గా ఉండేందుకు ఈ పిల్లాడు చాలు’, ‘ప్రయత్నించినోడికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది’, ‘ఫైనల్ విన్నింగ్ మోమెంట్ అద్భుతం’, ‘వెరీ బ్యూటిఫుల్ వీడియో’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story