- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డెవిల్ రైడ్.. అదృశ్యమైతే డబ్బులు వాపస్!
దిశ, ఫీచర్స్ : బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 5 లక్షల చ.కి.మీ.

దిశ, ఫీచర్స్ : బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 5 లక్షల చ.కి.మీ. మేర విస్తరించిన 'బెర్ముడా ట్రయాంగిల్' ప్రాంతంలోకి ఓడలు వెళ్లగానే వాటి జాడ తెలియకుండా పోయేది. ఆ ప్రాంతం మీదుగా ఎగిరే విమానాలు కూడా మాయమవడం ఎన్నో ఏళ్లుగా అంతుచిక్కని రహస్యంగా మిలిగిపోయింది. దీంతో బెర్ముడా ట్రయాంగిల్‌కు 'డెవిల్ ట్రయాంగిల్' అనే పేరు కూడా వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన ఏన్షియంట్ మిస్టరీస్ సంస్థ ప్రయాణికుల కోసం విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా మిస్టీరియస్ బెర్ముడా ట్రయాంగిల్‌కు వెళ్లే క్రూయిజ్ అదృశ్యమైతే అందులో ప్రయాణించే వారికి పూర్తి డబ్బులు వాపసు అందుతుందని పేర్కొంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
ఏన్షియంట్ మిస్టరీస్ అనే సంస్థ వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ నుంచి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ఓ భారీ క్రూయిజ్‌ను నడపబోతోంది. అయితే ఆ క్రూయిజ్ గనుక బెర్ముడా ట్రయాంగిల్‌లో అదృశ్యమైతే ప్రయాణం కోసం కట్టిన మొత్తం డబ్బులను ప్యాసింజర్లకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇస్తోంది. ఈ జర్నీ కోసం ప్రయాణికులు షిప్‌లోని క్యాబిన్ కోసం సుమారు రూ. 1,42,271.36( £1,450) చెల్లించాలి.






