Viral Video: ఇతని తెలివికి ఆటో వాలా షాక్.. వామ్మో చాట్ జీపీటిని ఇలా వాడేస్తున్నారు ఏంట్రా బాబోయ్

by Vennela |

Viral Video: ఇటీవల కాలంలో బెంగళూరులో భాషాభిమానులు అలాగే హిందీ మాట్లాడే వారి మధ్య పెద్ద ఎత్తున గొడవలు చెడరేగుతున్నాయి.

Viral Video: ఇతని తెలివికి ఆటో వాలా షాక్.. వామ్మో చాట్ జీపీటిని ఇలా వాడేస్తున్నారు ఏంట్రా బాబోయ్
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఇటీవల కాలంలో బెంగళూరులో భాషాభిమానులు అలాగే హిందీ మాట్లాడే వారి మధ్య పెద్ద ఎత్తున గొడవలు చెడరేగుతున్నాయి. ఆ మధ్య కాలంలో ఒక వైరల్ వీడియోలో కన్నడ మాట్లాడుతున్న ఆటో డ్రైవర్ ను హిందీ మాట్లాడే ఒక కస్టమర్ బెదిరిస్తూ …కర్ణాటక అయినా బెంగళూరు అయినా సరే ఎక్కడైనా సరే హిందీలోనే మాట్లాడాలని తాను కన్నడలో మాట్లాడనని తెగేసి చెప్పాడు. అప్పట్లో ఈ వీడియో ఒకసారిగా సంచలనం అయింది.

చాలామంది స్థానికుల మనోభావాలను సైతం దెబ్బతీసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం నెటిజన్లను ఆలోచింపజేసింది అని చెప్పవచ్చు. కన్నడ మాట్లాడటం రాని ఒక కస్టమర్, కేవలం కన్నడ మాత్రమే మాట్లాడే ఒక ఆటో డ్రైవర్ తో బేరమాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇందులో కస్టమర్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బాట్ తో మాట్లాడుతూ, తాను రెగ్యులర్గా వెళ్లే మార్గంలోనే వెళుతున్నాడని ఆటో డ్రైవర్ అడిగినట్లుగా 150 రూపాయలు కాకుండా 100 రూపాయలు మాత్రమే ఇస్తానని, ఈ మేరకు కన్నడలో ట్రాన్స్లేట్ చేసి ఆటో డ్రైవర్ కు చెప్పమని ఆ చాట్ బాట్ ను కోరింది.

దీనికి ఆ చాట్ బాట్ స్పందిస్తూ కన్నడలో మాట్లాడుతూ, ఆ అబ్బాయి రోజు ఇదే మార్గంలో వెళ్తాడు అతను 150 రూపాయలకు బదులు 100 రూపాయలు ఇస్తాను అంటున్నాడు నీకు సమ్మతమేనా అని అడిగింది. అందుకు ఆటో డ్రైవర్ 120 రూపాయలు ఇవ్వమని బేరం ముగించే ప్రయత్నం చేశాడు. అందుకు ఆ విద్యార్థి ఒప్పుకున్నాడు. ఈ సంభాషణ మొత్తం కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి ఆ యువకుడు చేసిన పనిని బెంగళూరులో కన్నడ రాని ఇతర ప్రాంతీయులు కూడా ఎదుటివారి భాషను గౌరవించి ఇలాంటి ప్రయత్నాలు చేయాలని అంతేకానీ పొగరుతో స్థానిక భాషలను వెక్కిరించడం సబబు కాదని నెటిజన్లు సూచిస్తున్నారు.



Next Story