Virla Post: జీతం పెరగదు..ఇంటి అద్దె మాత్రం పీక్ కి వెళ్తుంది.. బెంగుళూరు ఉద్యోగి కామెంట్స్ వైరల్

by Vennela |

Virla Post: ఆఫీస్‌లో గొడ్డుచాకిరి.. టార్గెట్లు..డెడ్‌లైన్లు అంటూ టెన్షన్.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు.. ఇది సరిపోదన్నట్టు ధరల పెరుగుదల.. ముఖ్యంగా ఇంటి అద్దె ప్రతీ ఏడాది పెరుగుతూపోతోంది.

Virla Post: జీతం పెరగదు..ఇంటి అద్దె మాత్రం పీక్ కి వెళ్తుంది.. బెంగుళూరు ఉద్యోగి కామెంట్స్ వైరల్
X

దిశ,వెబ్ డెస్క్: Virla Post: ఆఫీస్‌లో గొడ్డుచాకిరి.. టార్గెట్లు..డెడ్‌లైన్లు అంటూ టెన్షన్.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు.. ఇది సరిపోదన్నట్టు ధరల పెరుగుదల.. ముఖ్యంగా ఇంటి అద్దె ప్రతీ ఏడాది పెరుగుతూపోతోంది.. అదే సమయంలో జీతం మాత్రం పెరగదు.. ఎంత పని చేసినా కొంచమే పెరుగుతుంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ఎక్స్ యూజర్ తన నిరాశను షేర్ చేసుకున్నాడు.

తన జీతం 7.5శాతం మాత్రమే పెరిగిందని..తన ఇంటి యజమాని మాత్రం అద్దె 10శాతం పెంచాడంటూ వాపోయాడు. బెంగళూరులో జీతాల పెంపు, అద్దెల పెంపు మధ్య అంతరాన్ని ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చలకు దారి తీసింది. ఓ యూజర్ తన అనుభవాన్ని షేర్ చేశాడు. పెరుగుతున్న అసమానతల పై ఆందోళన వ్యక్తం చేసిన అతను.. ఆ ధోరణి ఇలాగే కొనసాగితే తన అద్దె చివరికి తన జీతాన్ని మించిపోతుందని వ్యాఖ్యానించాడు.


వివేక ఖత్రి అనే యూజర్ ఈ పరిస్థితిని అర్బన్ స్కామ్ గా అభివర్ణించాడు. కరెంటు బిల్లు 12శాతం,రెంట్ 10శాతం, పాలు 15 శాతం పెరుగుతుంది. కానీ వేతనం 7.5శాతం పెరుగుతుంది. ఈ లెక్కన ఏదొక రోజు మీ ఇంటి యజమాని మీ జీతంతో మీకంటే ధనవంతుడు అవుతాడు అంటూ పేర్కొన్నాడు. మరోనెటిజన్ మాత్రం కంపెనీ, ఇంటి యజమానిని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. లాండ్ లార్డ్ గా ఎలా మారాలనే దానిపై ఒక ప్రత్యేక పూర్తి కాల కోర్సు ఉండాలని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Next Story