- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్త్రీలకు బ్రా ఎఫెక్ట్.. అది లేకుంటేనే వక్షోజాలకు ఆరోగ్యం.. ఆ భంగిమ సొంతం
స్త్రీలు ‘బ్రా’ ధరించడం వారి జీవితంలో భాగమైపోయింది. విడదీయలేని బంధంగా మారిపోయింది.

దిశ, ఫీచర్స్: స్త్రీలు ‘బ్రా’ ధరించడం వారి జీవితంలో భాగమైపోయింది. విడదీయలేని బంధంగా మారిపోయింది. మెడపై ఒత్తిడి, గర్భాశయ నొప్పులు, భుజం, వెన్నునొప్పితో బాధపడుతున్నా.. ఛాతీ ప్రాంతంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోయినా సొసైటీ ఏమనుకుంటుందోనని తప్పక ధరిస్తున్నారు. అయితే దీని నుంచి విముక్తి ఎందుకు కోరుకోకూడదు అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ బ్రాలను పక్కన పెట్టి స్వేచ్ఛను అనుభవించమని.. హాయిగా ఊపిరిపీల్చుకోమని పిలుపునిస్తున్నారు. ఆ విధంగా బ్రెస్ట్ హెల్త్, ఎంపవర్‌మెంట్ ప్రాధాన్యత గురించి వివరిస్తున్న ఎక్స్‌పర్ట్స్.. ‘NO BRA’ అనేది నార్మల్ లైఫ్ స్టైల్ చాయిస్‌గా ఎందుకు మారకూడదని ప్రశ్నిస్తున్నారు. ఇందువల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్తున్నారు.
కంఫర్ట్.. బ్రెస్ట్ హెల్త్
బ్రా లెస్‌గా మారడం వల్ల మోస్ట్ ఇమ్మిడియేట్ బెనిఫిట్ కంఫర్ట్. చర్మాన్ని గుచ్చి గుచ్చి, ఆ ప్రాంతంలో మచ్చలుగా మారిపోయే ఇబ్బందికరమైన పట్టీల నుంచి విముక్తి కలుగుతుంది. బ్రా లెస్‌గా ఉండటం వల్ల శరీరం సౌకర్యంగా ఉంటుంది. వక్షోజాలకు విముక్తి, ఓదార్పు లభిస్తుంది. బ్రాలు కొన్నిసార్లు రక్త ప్రసరణ, శోషరస ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మొత్తం రొమ్ము ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ధరించకుండా ఉంటే రక్తప్రసరణ మెరుగుపడి.. మీ శరీరం సహజంగా టాక్సిన్స్‌ను శుభ్రపరుస్తుంది. శోషరస రద్దీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో బ్రెస్ట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది.
బాడీ కాన్ఫిడెన్స్.. పర్యావరణ పరిరక్షణ
మీరు బ్రాను ధరించకూడదని నిర్ణయించుకున్నప్పుడు.. మీరు మీ శరీరాన్ని అత్యంత సహజమైన స్థితిలో చూడగలుగుతారు. ఇది బాడీ కాన్ఫిడెన్స్‌ను గణనీయంగా పెంచుతుంది. కృత్రిమ మద్దతు లేకుండా ఉన్న వక్షోజాల ఆకారం, పరిమాణాన్ని అభినందిస్తారు. శరీరాన్ని యథాతథంగా ప్రేమించడం నేర్చుకోవడం వల్ల ఈ బ్రా బంధనాల నుంచి విముక్తి పొందుతారు. పైగా ప్రస్తుత మార్కెట్‌లో బ్రా కొనుగోలు చేసేందుకు వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ వేసుకోకూడదని నిర్ణయించుకున్నప్పుడు డబ్బు ఆదా చేయడమే కాకుండా ఫ్యాషన్ సంబంధిత వ్యర్థాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడినవారు అవుతారు.
బలమైన ఛాతీ కండరాలు..
బ్రాలెస్‌గా మారడం వల్ల ఛాతీ కండరాలు బలంగా తయారవుతాయి. బ్రెస్ట్‌కు మద్దతు ఇచ్చే కండరాలు.. బ్రా చేత ప్రెస్ చేయబడనప్పుడు వ్యాయామాన్ని పొందుతాయి. తద్వారా బెస్ట్ పోశ్చర్, టోన్డ్ ఛాతీ కండరాలను పొందుతారు. రొమ్ము ఆకృతి మెరుగుపడుతుంది. నిజానికి బ్రాలు వక్షోజాలకు మద్దతిచ్చే స్నాయువులను బలహీనపరుస్తాయి. బ్రెస్ట్ సహజంగా కదలడానికి అనుమతించడం ద్వారా స్నాయువులను బలోపేతం చేయొచ్చు. ఇక వీటిని ధరించడం ద్వారా కొన్నిసార్లు శరీర ఉష్ణోగ్రత పెరగడానికి దారితీయవచ్చు. అందుకే బ్రాలెస్‌గా ఉండటం బాడీ టెంపరేచర్‌ను మరింత సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. వేడి వాతావరణంలో లేదా శారీరక శ్రమల సమయంలో చెమట పట్టకుండా ఉంటుంది.






