శృంగారంపై అనసూయ రియాక్షన్.. ప్రతిరోజూ పాల్గొంటే ఎలా ఉంటుందో తెలుసా...

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-04 13:18:02  IST  )

ఈ మధ్య ఓ పాడ్‌కాస్ట్‌లో జబర్దస్త్ అనసూయ సెక్స్‌ను ఒక టబూగా చూడొద్దని.. బతికేందుకు నీరు, ఆహారం ఎలాగో ఇది కూడా అలాగే అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ క్లిప్..

శృంగారంపై అనసూయ రియాక్షన్.. ప్రతిరోజూ పాల్గొంటే ఎలా ఉంటుందో తెలుసా...
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య ఓ పాడ్‌కాస్ట్‌లో జబర్దస్త్ అనసూయ సెక్స్‌ను ఒక టబూగా చూడొద్దని.. బతికేందుకు నీరు, ఆహారం ఎలాగో ఇది కూడా అలాగే అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ క్లిప్.. చాలా మందికి అసహనం కలిగిస్తే.. ఇంకొందరు మాత్రం ఎంత రెగ్యులర్‌గా కలవొచ్చు? రోజూ శృంగారంలో పాల్గొనచ్చా? అని అడుగుతున్నారు. కాగా దీనిపై రియాక్ట్ అవుతున్న ఎక్స్‌పర్ట్స్.. ప్రతిరోజూ సెక్స్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని చెప్తున్నారు. సైంటిఫిక్‌గా ఇందుకు సంబంధించి పాజిటివ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయని సూచిస్తున్నారు.

ఇక ఓ సర్వేలో అమెరికా అడల్ట్స్ ఏడాదికి సగటున 53సార్లు శృంగారంలో పాల్గొంటారని తేలింది. అంటే వారానికి ఒక్కసారి కన్నా ఎక్కువే. కాగా మీ భాగస్వామికి, మీకు మధ్య ఉండే రిలేషన్ బేస్ చేసుకుని ప్రతిరోజూ పాల్గొన్న సమస్యే లేదని తేల్చింది.

* శృంగారంలో పాల్గొనడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది.

* సాన్నిహిత్యం సమయంలో బ్రెయిన్ ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.

* సెక్స్ సమయంలో విడుదలయ్యే లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

* ఈ సెషన్‌లో వినియోగించే శక్తి కేలరీలను బర్న్ చేస్తుంది. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

* ప్రతిరోజూ సాన్నిహిత్యం బరువు తగ్గడానికి అవకాశంగా మారుతుంది.

* అంతేకాదు సెక్స్ మెరుగైన నిద్రను అందిస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

Read Also..

తల్లిపాలు/ఫార్ములా మిల్క్.. రెండింటిలో పిల్లలకు ఏవి మంచివి..?

Next Story