IPGతో వెన్నుముకకు జీవం.. పక్షవాతానికి ఎలక్ట్రానిక్ డివైజ్‌తో చెక్!

by B.Srinivas |

పక్షవాతం, ప్రమాదంతో చచ్చుపడిపోయిన వెన్నుముక పునర్వైభవంకోసం వైద్యులు ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్‌ను డెవలప్ చేశారు.

IPGతో వెన్నుముకకు జీవం.. పక్షవాతానికి ఎలక్ట్రానిక్ డివైజ్‌తో చెక్!
X

దిశ, ఫీచర్స్: పక్షవాతం, ప్రమాదం, ఇతర గాయాలతో వెన్నుముక విరిగి లేదా చచ్చుపడిపోయినవారికి వైద్యులు ఎగిరిగంతేసే శుభవార్త చెప్పారు. మంచానికే పరిమితమైనవారు లేచి నడిచేలా, సులభంగా మెట్లు ఎక్కేలా, సైకిల్ తొక్కేలా వెన్నుముకకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్‌ను డెవలప్ చేశారు. ఈ మేరకు బెల్జియంలోని ONWARD Medical కంపెనీ, స్విట్జర్లాండ్‌కు చెందిన EPFL (NeuroRestore)పరిశోధనా సంస్థ సంయుక్తంగా చేపట్టిన ప్రయోగంలో వెన్నుముక ఇబ్బందులతో బాధపడేవారి కోసం(Spinal Cord Injuries) వైర్‌లెస్ ఎలక్ట్రానిక్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

బ్రెయిన్ సిగ్నల్స్ రియాక్టీవ్..
ఇది ‘ఇంప్లాంటబుల్ పల్స్ జనరేటర్’ (IPG) అనే బ్యాటరీతో పనిచేసే స్పైనల్ కోడ్ స్టిమ్యులేటర్. ఆపరేషన్ సమయంలో దీనిని పిరుదులపై వెన్నుపూస భాగంలో అమర్చుతారు. ఇది పూర్తిగా వైర్‌లెస్ ప్రక్రియ. బయటనుంచి పంపిన డేటాను రిసీవ్ చేసుకోగానే సంబంధిత కండరాలను ఉత్తేజపరుస్తుంది. ఇది కాళ్లతోపాటు మెదడు నరాలకు విద్యుత్ సంకేతాలను పంపిస్తుంది. వెంటనే బ్రెయిన్ నుంచి ఆగిపోయిన సిగ్నల్స్ రియాక్టీవ్ అవుతాయి. దీంతో పేషెంట్ నేరుగా తన కాళ్లను కంట్రోల్ చేసుకోవచ్చు. దీనిని మొబైల్, ట్యాబ్, స్మార్ట్‌వాచ్‌, యాప్ వాయిస్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ పరికరం కేవలం వెన్నుముకకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా గాయాన్ని నయం చేసే ప్రక్రియ పర్యవేక్షణ సెన్సార్లను కలిగి ఉంటుంది.

లైంగిక సామర్థ్యం..
ఈ ప్రక్రియలో సాధారణ స్టిమ్యూలేటర్లు వెన్నుముకకు నిరంతరం ఒకే తరహా పవర్‌ను జనరేట్ చేస్తాయి. రోగి నడుస్తున్నపుడు బ్రెయిన్ ఏ ఏ కండరాలకు ఏ సమయంలో సిగ్నల్స్ పంపాలో సరిగ్గా అదే టైమ్‌కు పవర్ మోటివేషన్స్ ఇస్తుంది. కేవలం కండరాలను కదిలించడమే కాకుండా సహజంగా నడుస్తున్న భావవను కలిగిస్తుంది. దీంతో పట్టుకోల్పోయిన కాళ్లతో ఈజీగా నిలబడటం, నడవటం, సైకిల్ తొక్కడం, స్విమ్మింగ్ వంటి పనులను సులభంగా చేయగలుగుతారు. అంతేకాదు మూత్రాశయం ప్రక్రియ మెరుగుపడటంతోపాటు లైంగిక పనితీరును కూడా యాక్టివ్ చేస్తుంది. వెన్నుముకకు గాయాలైన చాలామందిలో రక్తపోటు సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఈ పరికరం రక్తపోటును కంట్రోల్ చేసే నరాలను ప్రేరేపించి, పేషెంట్ సృహ కోల్పోకుండా నిరంతరం చురుకుగా ఉండేలా హెల్ప్ అవుతుంది.

‘యూరప్‌లో 200లకు పైగా వెన్నుముక పేషెంట్స్ ఈ ఎలక్ట్రానిక్ పరికరంతో మళ్లీ నార్మల్ అయ్యారు. 2024-25లో వెన్నముక పూర్తిగా తెగిపోయిన (Complete SCI) ముగ్గురు వ్యక్తులు ఈ ఇంప్లాంట్ వేసుకున్న ఒక్కరోజులోనే నిలబడగలిగారు’ అని న్యూరోసర్జన్ డాక్టర్: జోసెలిన్ బ్లాచ్ తెలిపారు.

Next Story