- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Busy Life : బిజీ షెడ్యూల్ వల్ల సఫర్ అవుతున్నారా..? ఉత్సాహం నింపే టిప్స్ ఇవిగో!

దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా బిజీ బిజీగా గడిపేస్తుంటారు కొందరు. క్షణం తీరికలేని పనులతో అవస్థలు పడుతుంటారు. ఇటు కుటుంబ బాధ్యతలు, అటు కెరీర్ పరంగా ఎదురయ్యే సవాళ్ల నడుమ సతమతం అవుతుంటారు. లైఫ్ అన్నాక కొన్ని ప్రాబ్లమ్స్ కామనే అయినప్పటికీ, కొందరు మరీ భూతద్దంలో పెట్టి చూస్తుంటారు వాటిని. దీంతో నిరాశా నిస్పహ, నిరుత్సాహం వంటివి ఎదురవుతుంటాయి. క్రమంగా అవి ఫిజికల్ హెల్త్‌పై కూడా ప్రభావం చూపుతుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటడాలంటే.. మిమ్మల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా సహాయపడే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దామా..!
ఫిజికల్ యాక్టివిటీస్
మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే క్రమం తప్పకుండా వ్యాయామాలు లేదా ఏదో ఒకరకమైన ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. ఆ సమయంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి చాలా ముఖ్యం. జిమ్‌లో చేసే వర్కౌట్స్ మాత్రమే కాకుండా వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, మెడిటేషన్ వంటివి డైలీ అరగంట ప్రాక్టీస్ చేస్తే బీజీ లైఫ్ నుంచి బిగ్ రిలీఫ్ పొందవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
భావోద్వేగాల నియంత్రణ
మనిషన్నాక ఆయా విషయాలపట్ల స్పందనలు, భావోద్వేగాలు సహజమే. అయితే మీరు వాటి కంట్రోల్లోకి వెళ్లినప్పుడు ఒత్తిడి, ఆందోళ, డిప్రెషన్ తదితర సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భావోద్వేగాలు మీ నియంత్రణలో ఉండేలా చూసుకోండి అంటున్నారు మానసిక నిపుణులు. ముఖ్యంగా కోపం, ఆవేశం, అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు వంటివి అధికం అయితే మీకే నష్టం కాబట్టి వాటిని కంట్రోల్లో ఉండే టెక్నిక్స్ పాటించండి. యోగా, మెడిటేషన్ వంటివి అందుకు సహాయపడతాయి. ప్రతి రోజూ కాసేపు ప్రకృతిలో గడపడం, మీ మనసుకు ఆనందాన్నిచ్చే వ్యాయామాలు చేయడం వంటివి కూడా మీలోని ప్రతికూల భావాలు తగ్గిస్తాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.
ఏకాంతంగా గడపడం
ఒంటరి తనం వేరు.. ఏకాంతం వేరు. ఒంటరి తనం మానసిక సమస్యలకు దారితీయవచ్చు. కానీ అప్పుడప్పుడు ఎవరూలేకుండా కాసేపు ఏకాంతంగా గడపడం మీకు రిలాక్సేషన్ అందిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్ద వాతావరణంలో మిమ్మల్ని మీరు మనసులో ప్రశ్నించుకుంటారు. ఒక విషయంపై లోతుగా ఆలోచిస్తారు. దీనివల్ల మీరు ఎదర్కొనే సమస్యకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు వంటివి దూరం అవుతాయి. కాబట్టి మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే రోజూ ఉదయం లేదా సాయంకాలం కాసేపు మీకంటూ ఏకాంత సమయం అవసరమేమో ఆలోచించండి.
క్వాలిటీ స్లీప్
చాలా సమస్యలు నిద్రలేమితో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు మీ పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. ప్రొడక్టివిటీ తగ్గవచ్చు. దీర్ఘకాలంపాటు నిద్రలేమిని ఎదుర్కొనేవారు మానసిక, శారీరక అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా అధికమే. కాబట్టి మీరు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో నిద్రపోయినా అది నాణ్యమైనదిగా ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
పాజిటివ్ థింకింగ్
మీ ఆలోచనలు ఎలా ఉంటే.. మీకు సంబంధించిన చాలా విషయాలు అందుకు అనుగుణంగానే జరిగే అకాశం ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు ప్రతీ విషయంలో సానుకూలంగా ఉండేలా చూసుకోండి. పాజిటివ్ థింకింగ్ మీలో ఆనందాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రతి కూల ఆలోచనలు ఎక్కువైతే నిరాశ, నిస్పృహలకు దారితీస్తాయి. అందుకే పాజిటివ్ ఆలోచనలను ప్రాక్టీస్ చేయడం వల్ల మీ జీవితం కూడా పాజిటివ్ మార్గంలో సాగే చాన్స్ ఎక్కువగా ఉంటుందని సైకాలజిస్టులు అంటున్నారు.
కృతజ్ఞతా భావం
మీరు జీవితంలో సంతోషంగా ఉంటున్నారంటే.. అందుకు బయటి పరిస్థితులు, వ్యక్తులు, ప్రకృతి, వనరులు, సహాయం చేసిన స్నేహితులు, ఉద్యోగం చేసే సంస్థ ఇలా అనేక కారణాలు ఉండి ఉంటాయి. అందుకే మీరు వాటన్నింటిపట్ల ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావం కలిగి ఉంటారో అప్పుడు సంతోషంగా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా ఉండటం మీలో స్వీయ ఆనందానికి దారితీస్తుంది. మీకు మేలు చేసిన వ్యక్తులను, పరిసరాలను, పరిస్థితులను సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకోవడం, కృతజ్ఞతగా ఫీలవడం మీలో హ్యాపీ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. మీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది.