- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ఎన్నో గ్లోబల్ సమ్మిట్‌లకు..
అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైదరాబాద్..
మిస్ వరల్డ్ పోటీల రూపంలో మరో ప్రపంచ వేడుకలకు స్వాగతం పలకగా..
అందాల భామలు తెలంగాణలో సందడి చేస్తున్నారు.
మౌలిక సౌకర్యాలు.. ఆర్థిక వనరులు.. పర్యాటక స్థితిని చూసి అబ్బురపడుతున్నారు.
సాంస్కృతిక వారసత్వం.. అంతర్జాతీయ ఈవెంట్‌ల ట్రాక్ రికార్డు బాగుందంటున్నారు.
- దిశ, ఫీచర్స్
120 దేశాలు
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో దాదాపు 120 దేశాల అందగత్తెలు పాల్గొంటారు. ఆసియా నుంచి ఇండియా.. చైనా.. జపాన్.. మలేషియా.. ఫిలిప్పీన్స్.. వియత్నాం.. శ్రీలంక సుందరీమణులు పాల్గొంటున్నారు. ఆఫ్రికా నుంచి బోట్స్వాన్.. కామెరూన్.. కెన్యా.. మారిషస్.. నైజీరియా.. దక్షిణాఫ్రికా.. ట్యూనీషియా.. జింబాబ్వే దేశాల యువతులు పాల్గొంటున్నారు. అలాగే అమెరికా నుంచి అర్జెంటీనా.. బ్రెజిల్.. కెనడా.. చిలీ.. డొమినికన్ రిపబ్లిక్.. జమైకా.. మెక్సికో.. పనామా.. పరాగ్వే.. పెరూ.. ప్యూర్టోరికో.. ట్రినిడాడ్.. టొబాగో.. యునైటెడ్ స్టేట్స్ బ్యూటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు.
నీ పేరేమిటి అందమా.?
120 దేశాల నుంచి హైదరాబాద్‌కు అందాల ప్రదర్శనకు వస్తున్నవారిలో అచే అబ్రహమ్స్.. లెసిగో చోంబో.. క్రిస్టినా పిస్కోవా.. యాస్మినా జైటౌన్.. జెసికా గాగెన్ వంటి బ్యూటీస్ ఉన్నారు. వీరిలో అచే అబ్రహమ్స్ అమెరికా ఖండం నుంచి ట్రినిడాడ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఆఫ్రికా ఖండం బోట్స్వానా నుంచి లెసిగో చోంబో ప్రాతినిథ్యం వహిస్తోంది. అలాగే చెక్ రిపబ్లిక్ నుంచి క్రిస్టినా పిస్కోవా పాల్గొంటుంది. యాస్మినా జైటౌన్ లెబనాన్.. ఇంగ్లండ్ నుంచి జెసికా గాగెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఫస్ట్ మిస్ వరల్డ్
1951 జూలై 29న ఫస్ట్ మిస్ వరల్డ్ పోటీలను ఇంగ్లండ్‌లో నిర్వహించారు. 26 మంది మాత్రమే ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ 26 మంది అందగత్తెల్లోనూ ఇంగ్లండ్ నుంచి పాల్గొన్నవారే ఎక్కువ. 22 ఏళ్ల స్వీడన్ బ్యూటీ "కికి హకాన్సన్" టైటిల్‌ను గెలుచుకుంది. ఎరిక్ మోర్లీ ఈ వేడుకలను నిర్వహించగా మొదట "ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్" వేడుకల్లో భాగంగా "ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్" అని పిలిచేవారు. తర్వాత "మిస్ వరల్డ్" అని పేరు మార్చి అప్పటి నుంచి ప్రతీయేడు నిర్వహిస్తు్న్నారు. 1952లో స్వీడన్ మోడల్ రాణి మే లూయిస్ ఫ్లోడిన్ అందాల కిరీటాన్ని గెలుచుకుంది.
మిస్ వరల్డ్ ఎందుకు.?
మిస్ వరల్డ్ పోటీలను కేవలం అందాల ప్రదర్శన కోసమే కాకుండా అంతర్లీనంగా సామాజిక అంశాన్ని జోడించి నిర్వహిస్తుంటారని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మెన్, సీఈఓ జూలియా మోర్లీ అంటున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు చాటిచెప్పే అంశంగా భావిస్తారు. మహిళల్లో దాగివున్న ప్రతిభను.. నైపుణ్యాలను.. దాతృత్వ గుణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా దేశాల సాంస్కృతిక నేపథ్యాలను ప్రతిబింబింపజేస్తారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వేదికగా భావిస్తారు. వీటితో పాటు మహిళా అభివృద్ధికి చిహ్నంగా ఈ పోటీలను భావిస్తారు.
నిర్వహణ ఎవరిది.?
మిస్ వరల్డ్ అందాల పోటీని మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. దీని బాధ్యతలను జూలియా మోర్లీ చూస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలు.. ధార్మి కార్యక్రమాలు.. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతీ సంవత్సరం ఈ సంస్థ నిర్వహిస్తుంది. అంతకుముందు ఈ బాధ్యతను జూలియా మోర్లీ భర్త ఎరిక్ మోర్లీ చూసుకునేవారు. 2000లో ఎరిక్ మోర్లీ మరణించడంతో ఆ బాధ్యతను జూలియా మోర్లీ చూసుకుంటుంది. మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి దాదాపు $10- $15 మిలియన్ల ఖర్చు అవుతుందని ఒక అంచనా. దీనిని ఆతిథ్య దేశం స్పాన్సర్ల భాగస్వామ్యంతో భరిస్తుంది.






