- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ రూమ్‌మేట్.. సీలింగ్ ఫ్యాన్ మానిటరింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేసిన టెకీ!
ఏఐ పవర్డ్ సీలింగ్ ఫ్యాన్ సిస్టమ్‌ను బిల్డప్ చేసి అద్భుతం క్రియేట్ చేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు సొంత అవసరాలు కూడా మనిషినిలో క్రియేటివిటీని ప్రేరేపిస్తాయి. బెంగుళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాధించిన అద్భుతమే ఇందకు చక్కటి ఉదాహరణ అంటున్నారు కొందరు సాంకేతిక నిపుణులు. ఇంతకీ అతనెవరు? ఏం చేశాడంటే.. తరచుగా మధ్య రాత్రి నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు అతను సీలింగ్ ఫ్యాన్‌ను మానిటరింగ్ చేసే ఏఐ పవర్డ్ వ్యవస్థను రూపొందించాడు.
ఏఐ పవర్డ్ సీలింగ్ ఫ్యాన్
పడుకునేటప్పుడు అప్పటి వెదర్‌ను బట్టి ఫ్యాన్ తిరిగే వేగాన్ని 3 నుంచి 5 నంబర్ల వరకు ఏదో ఒక ననచ్చిన నంబర్‌పై కూలింగ్ కోసం బటన్ సెట్‌చేసి పెట్టుకుంటుంటారు. అయితే అలా సెట్ చేసి పడుకున్నాక.. గంటా రెండు గంటల తర్వాతనో, లేకపోతే అర్ధరాత్రి వాతావరణం చల్లబడటం కారణంగానో కూలింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. దీంతో చలిపెట్టడం వల్ల కొందరికి మధ్య రాత్రి నిద్రకు డిస్టర్బ్ అయి మేల్కొంటారు. మరికొన్నిసార్లు తక్కువ గాలి వచ్చేలా తక్కువ నంబర్లపైన సెట్ చేసి పెట్టినప్పుడు, వెదర్ వేడెక్కి కూడా ఇలా నిద్రాభంగం కలిగే చాన్స్ ఉంటుంది. ఈ సమస్యనే ఎదుర్కొన్న బెంగుళూరు యువకుడు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన పంకజ్ (X Handle: @the2ndfloorguy) ఒక అద్భుతం చేశాడు. ఏఐ ఆధారంగా పనిచేసే.. ఫ్యాన్ తిరిగే విధానాన్ని కంట్రోల్ చేసే ఒక సాంకేతిక వ్యవస్థను సృష్టించాడు. అదే ‘ఏఐ పవర్డ్ సీలింగ్ ఫ్యాన్ సిస్టమ్’
ఎలా పనిచేస్తుంది?
ఫ్యాన్ వేసుకున్నప్పుడు ‘3 3 AM వద్ద స్వెటీ లేదా ఫ్రీజింగ్‌గా మేల్కొనడం వల్ల బాగా ఇబ్బంది పడ్డాను’ అని తన X పోస్ట్‌లో పేర్కొన్న పంకజ్ దీనికి పరిష్కారంగానే తను ఏఐ పవర్డ్ సీలింగ్ ఫ్యాన్ మానిటరింగ్ సిస్టమ్‌ను క్రియేట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇందుకోసం అతను AI + MediaPipe + Raspberry Piతో హోమ్ సర్వర్‌పై MediaPipe పోజ్ డిటెక్షన్ మోడల్ రన్ చేసి, కెమెరా ద్వారా తన నిద్రా స్థితిని రియల్ టైమ్‌లో మానిటర్ చేసే సిస్టమ్ బిల్డ్ చేశాడు. అంటే ఇది పడుకున్నప్పుడు అతని శరీర భంగిమ(Body pose)ను గుర్తిస్తుంది. చేతులు లేదా కాళ్లు వ్యక్తి శరీరంపై కప్పుకున్న బెడ్‌షీట్ లోపలి నుంచి పైకి వచ్చి ఉంటే.. వేడిగా ఉందదనే సిగ్నల్‌గా గుర్తించి సిస్టమ్ ఫ్యాన్‌ను ఆన్ చేస్తుంది పంకజ్ రూపొందించిన ఏఐ పవర్డ్ సిస్టమ్. అలాగే బాడీ కర్ల్ అప్ (చల్లగా ఉందని సిగ్నల్) అయితే ఫ్యాన్ ఆఫ్ అవుతుంది.
నిద్ర భంగిమను బట్టి
ఫ్యాన్ కంట్రోల్ కోసం రిమోట్ బటన్ పుషర్ (ఫిజికల్ స్విచ్ నొక్కే డివైస్) పంకజ్ ఉపయోగిస్తున్నాడు. ఏఐ(AI) సిగ్నల్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా స్విచ్ ప్రెస్ చేస్తుంది. ఇది రూమ్ టెంపరేచర్ సెన్సార్‌లపై ఆధారపడకుండా, నిద్రా పోజ్‌ను బట్టి పర్సనలైజ్డ్ కంఫర్ట్ ఇస్తుంది. పంకజ్ దీనిని ఏఐ రూమ్‌మేట్ అని పిలుస్తున్నాడు. ఇదే విషయాన్ని తన X హ్యాండిల్(@the2ndfloorguy)లో పోస్ట్ చేయగా.. తెగవైరల్ అవుతోంది. ఇలాంటి సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది స్మార్ట్ హోమ్ టెక్‌లో యాక్చువల్ లైఫ్ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసే గొప్ప ఉదాహరణగా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.






