- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడమ్ జీ.. బలరాంపూర్ బయోయుగ్.!
ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చో అని ఆలోచించలేమా అవంతికలా.?

దిశ, ఫీచర్స్: ప్లాస్టిక్ నిషేధం సాధ్యమా.? గవర్నమెంట్ వద్దని చెప్తుంది. పర్యావరణవేత్తలు వాడొద్దంటారు. మనగ్గూడా వాడకపోవడమే మంచిదనిపిస్తుంది. కానీ.. ప్లాస్టిక్ లేకుండా చిన్న పనికూడా కాదు. ఎలా.. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చో అని ఆలోచించలేమా అవంతికలా.?
మేడమ్ జీ ప్లాస్టిక్
ఉత్తరప్రదేశ్‌లోని "బలరాంపూర్ చినీ మిల్స్ లిమిటెడ్" ప్రారంభించిన "బలరాంపూర్ బయోయుగ్" ఇండియాలో తొలి పాలీ లాక్టిక్ యాసిడ్ బయో ప్లాస్టిక్ బ్రాండ్. అంటే మామూలు ప్లాస్టిక్‌లా కాకుండా చెరకు నుంచి తీసిన చెక్కరతో తయారుచేసే ప్లాస్టిక్ అన్నమాట. ఇది పర్యావరణానికి హానిచేయని ప్లాస్టిక్లను తయారుచేయడం ఈ బ్రాండ్ లక్ష్యం. చెరుకు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే కాకుండా.. స్థిరమైన భవిష్యత్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తోంది అవాంతికా సారావోగి. వాళ్లమ్మను అందరూ "మేడమ్ జీ" అనేవాళ్లు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ "మేడమ్ జీ" ప్లాస్టిక్ అని పిలుస్తున్నారు ప్రజలు.
కొత్త ఆలోచన..
"బలరాంపూర్ బయోయుగ్" ఫ్యాక్టరీ ఫార్ములాతో మొదలైనది కాదు. ఇదొక ప్రశ్నతో ఆరంభమైంది. ప్లాస్టిక్‌ను చమురు నుంచి కాకుండా శతాబ్దాలుగా మనం పండిస్తున్న చెరకు నుంచి తయారుచేస్తే ఏమవుతుది అనే ప్రశ్న వేసుకుంది అవాంతిక. ఒకసారి చెరకుతో తయారైన బాటిల్‌ను చూసింది. అది సాధారణ బాటిల్‌లాగే కనిపించింది. "నేను మొక్కల నుంచి తయారయ్యాను" అనే సందేశం రాసి ఉంది దానిపై. అప్పుడామె ముఖంలో కొత్త ఆలోచన. చెరకును ఉపయోగించి పర్యావణ హితమైన ప్లాస్టిక్‌ను ఎందుకు తయారుచేయొద్దనే ప్రశ్నే "బలరాంపూర్ బయోయుగ్" ఆవిష్కరణకు బీజం వేసింది.
కుంభీ నుంచి ప్రారంభం..
"బలరాంపూర్ బయోయుగ్" ఇండియాలోనే ఫస్ట్ పీఎల్ఏ బయోప్లాస్టిక్ ప్లాంట్. అన్నీ పనులు.. అనుమతులు కంప్లీట్ చేసుకొని 2026లో కుంభీలో దీనిని ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తోంది అవాంతిక. ఈ ప్లాంట్.. చెరకు నుంచి తీసిన చెక్కరను పీఎల్ఏగా మారుస్తుంది. అదికూడా పునర్వినియోగ శక్తితో నడిచేలా. పీఎల్ఏ అనేది సాంప్రదాయ ప్లాస్టిక్‌కు పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయం. ఇది ప్యాకేజింగ్.. బయోమెడికల్.. ఫుడ్ సర్వీస్ వంటి చాలా రంగాల్లో ఉపయోగపడుతుంది. ఈ పీఎల్ఏ పదార్థం సాంప్రదాయ ప్లాస్టిక్ లా కాకుండా కంపోస్టింగ్ సౌకర్యాల్లో 180 రోజుల్లో కుళ్లిపోతుంది.
చెరుకు ప్లాస్టిక్ ఎలా మారుతుంది.?
చెరకు రసం నుంచి తీసిన చెక్కరను ఫెర్మెంట్ చేసి లాక్టిక్ యాసిడ్‌ను తయారుచేస్తారు. ఇది పెరుగు లేదా వైన్ తయారీ లాంటి ప్రక్రియ. లాక్టక్ యాసిడ్‌ను రసాయనాలు లేకుండా శుద్ధి చేస్తారు. లాక్టిక్ యాసిడ్ నుంచి నీటిని తొలగించి డైమర్ తయారుచేస్తారు. డైమర్లను గొలుసులుగా మార్చి పీఎల్ఏ రెసిన్ ను ఉత్పత్తి చేస్తారు. దీనిని బాటిల్స్.. కంటైనర్ల.. ఇతర ఉత్పత్తులుగా రూపొందించవచ్చు. బలరాంపూర్ బయోయుగ్ వెనకున్న శక్తి రైతులే. బీసీఎంఎల్‌తో సంబంధం ఉ్న 5.5 లక్షల రైతులు ఈ ప్లాంట్ ను తమ సొంతంగా భావిస్తున్నారు.
బయో యుగం..
బలరాంపూర్ బయోయుగ్ ఇప్పటికే 250 ఉద్యోగాలనుసృష్టించింది. మరో 2000 ఉద్యోగాను సృష్టించే బయో ప్లాస్టిక్ క్లస్టర్ ప్రణాళిక ఉంది. ఈ ప్లాంట్ పూర్తిగా పునర్వినియోగ శక్తితో నడుస్తుంది. సాంప్రదాయ ప్లాస్టిక్ కంటే 80% తక్కువ కార్బన్ ఉద్గాలను ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో బయోమాస్ సమృద్ధిగా ఉంది. మనం ప్రపంచ బయో ప్లాస్టిక్.. బయోకెమికల్ హబ్‌గా మారవచ్చు. 2026 నాటికి ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేస్తే సంవత్సరానికి 80,000 టన్నుల పీఎల్ఏ ఉత్పత్తి చేస్తుంది. ఇది లక్షలాది ప్లాస్టిక్ బాటిల్స్ లేదా ప్యాకేజింగ్ యూనిట్లను భర్తీ చేయగలదు. ఇది కేవలం ఉత్పత్తి కాదు.. కొత్త యుగం.. బయో యుగం.






