- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముద్దుల జాతర.. అంతలోనే నీళ్లు చల్లుతుంటే.. ఆహా ఏం రొమాన్స్ (వీడియో)
ప్రపంచ దేశాలు విభిన్న సంస్కృతీ సాంప్రదాయాలను కలిగి ఉంటాయి. ఒక్కో దేశంలో ఒక్కో పండగతో ప్రత్యేకతను చాటుతాయి. కానీ ఇండోనేషియాలోని ఈ ఫెస్టివల్ మాత్రం నిజంగానే స్పెషల్. బాలిలోని ఓమెడ్ - ఓమెడాన్ ఉత్సవం దీని ప్రత్యేకత కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, ఫీచర్స్ : ప్రపంచ దేశాలు విభిన్న సంస్కృతీ సాంప్రదాయాలను కలిగి ఉంటాయి. ఒక్కో దేశంలో ఒక్కో పండగతో ప్రత్యేకతను చాటుతాయి. కానీ ఇండోనేషియాలోని ఈ ఫెస్టివల్ మాత్రం నిజంగానే స్పెషల్. బాలిలోని ఓమెడ్ - ఓమెడాన్ ఉత్సవం దీని ప్రత్యేకత కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్నే కిస్సింగ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తుండగా... డెన్పసర్‌లోని బంజార్ కాజా సెసెటన్‌లో ప్రతి ఏటా జరుపుకునే ఒక ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయం. దీన్ని నూతన సంవత్సరంగా జరుపుకుంటుండగా.. 17–30 సంవత్సరాల వయస్సు గల పెళ్లికాని యువత ఇందులో పాల్గొంటారు. బాలినీస్ హిందూ వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన ఈ ఉత్సవం సామరస్యం, సమాజంలో బంధాలు, బంధుత్వాలు, సానుకూల-ప్రతికూల శక్తుల సమతుల్యతను సూచిస్తుంది.
ఓమెడ్-ఓమెడాన్ అంటే బాలినీస్ భాషలో లాగడం అని అర్థం. కాగా ఉత్సవం లాగడంతో ముడిపడి ఉండే ఒక ఆట రూపంలో ఉంటుంది. బాలి నిశ్శబ్ద దినం న్యేపి తర్వాత రోజున ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సాధారణంగా మార్చి చివరలో లేదా ఏప్రిల్‌లో.. బంజార్ కాజా సెసెటన్, సౌత్ డెన్పసర్ ప్రధాన వీధిలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. గ్రామ బంజార్ ఆలయంలో ప్రార్థనలతో ఉత్సవం ప్రారంభమవుతుంది. సాంప్రదాయ బాలినీస్ నృత్యం, గమేలాన్ సంగీతంతో కోలాహలంగా ఉంటుంది. పెళ్లికాని యువత రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒక వైపు పురుషులు, మరోవైపు స్త్రీలు.. ఒకరినొకరు లాగుతూ ఉంటారు. అలా పురుషులు స్త్రీలను లాగి.. కౌగిలించుకుని.. ముద్దుపెట్టుకుంటారు. దాదాపు రెండు గంటల పాటు జరిగే ఉత్సవం నవ్వులు, ఆనందంతో నిండిపోగా.. ఇలా ముద్దులు పెట్టుకుంటున్న యువతపై గ్రామస్తులు బకెట్లతో నీళ్లు పోస్తారు. ఇది శుద్ధీకరణగా ట్రీట్ చేయబడుతుంది. ఉద్వేగాలను చల్లబరచడానికి సంకేతంగా గుర్తించబడుతుంది.
సాంస్కృతిక ప్రాముఖ్యత:
* యువతలో యూనిటీ పెంచుతుంది. స్నేహ బంధాలను బలపరుస్తుంది.
* గ్రామాన్ని దురదృష్టం నుంచి తప్పించి.. శుభం కలిగేలా చేస్తుందని, అందరికీ ఆయురారోగ్యాలు అందిస్తుందని నమ్ముతారు.
* సంబంధాలు బలపరిచేందుకు అవకాశంగా ఉంటుంది. ఈ ఉత్సవం ద్వారా చాలా జంటలు కలుసుకుని, తర్వాత వివాహం చేసుకుంటారని చెప్తారు.
మూలాలు:
* ఈ సంప్రదాయం దాదాపు 100 సంవత్సరాల నాటిదని, 17వ శతాబ్దం నుంచి కొనసాగుతుందని తెలుస్తోంది.
* ఒక కథనం ప్రకారం సౌత్ డెన్పసర్‌లోని పురి ఓకాలో అనారోగ్యంతో ఉన్న రాజు.. యువత ఆడిన కిస్సింగ్ గేమ్ చూశాక చూసిన తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడు కావడంతో దీన్ని కొనసాగించారని తెలుస్తోంది.
* మరో స్టోరీ ప్రకారం ఆడ, మగ పందుల మధ్య జరిగిన పోరాటంతో ముడిపడి ఉంది. కాస్మిక్ శక్తుల సమతుల్యతను సూచిస్తుంది.
* 1980లలో ఈ ఆచారం కొంతకాలం నిలిపివేయబడింది. కానీ మళ్లీ తిరిగి ప్రారంభించబడింది.
* 1984లో పబ్లిక్ ముద్దుల గురించిన ఫిర్యాదుల కారణంగా ఓమెడ్-ఓమెడాన్ డచ్ ఈస్ట్ ఇండీస్ ప్రభుత్వం నిషేధాన్ని ఎదుర్కొంది. కానీ ప్రతి ఏటా ఆడే ఈ ఆటను ఆచరించకపోవడం వల్ల దుర్ఘటనలు జరుగుతున్నాయని నమ్మిన గ్రామస్తులు తిరిగి ప్రారంభించారు.
* 2009 నుంచి ఇది సెసెటన్ హెరిటేజ్ ఓమెడ్-ఓమెడాన్ ఫెస్టివల్ (SHOF)గా నిర్వహించబడుతుంది. వివాదాస్పదంగా ఉన్నప్పటికీ.. పవిత్ర సంప్రదాయంగా, పర్యాటక ఆకర్షణగా ఆమోదించబడింది.
మీరూ చూడొచ్చు..
* ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ ఉత్సవాన్ని చూడొచ్చు. కానీ స్థానికులు మాత్రమే ఇందులో పాల్గొనే అర్హతను కలిగి ఉంటారు.
* సాంప్రదాయ ఆహారంతో వీధులు నిండిపోతాయి. లైవ్ మ్యూజిక్, కామెడీ షోలు కూడా నిర్వహించబడుతాయి.
* దీని విచిత్రమైన ఆట కారణంగా ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ క్యాచ్ చేస్తుంది. ఆచారం, సరదా, సాంస్కృతిక గర్వం కలిసిన శక్తివంతమైన మిశ్రమంగా పరిగణించబడుతుంది.






