- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aging Habits : ఈ అలవాట్లు డేంజర్.. మీ జీవిత కాలాన్ని తగ్గిస్తాయ్!
Aging Habits : ఈ అలవాట్లు డేంజర్.. మీ జీవిత కాలాన్ని తగ్గిస్తాయ్!

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ప్రతి ఒక్కరూ తమకంటూ కొన్ని హాబిట్స్ కలిగి ఉంటారు. అయితే కొన్ని అలవాట్లు మానసిక ఆనందాన్ని పెంపొందిస్తే.. మరికొన్ని ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని హాబిట్స్ మన ఆరోగ్యానికి మేలు చేయడం ద్వారా జీవిత కాలాన్ని పెంచితే.. మరికొన్ని వృద్ధాప్య ఛాయలను పెంచి ఆయుష్షును తగ్గిస్తాయి. అయితే లైఫ్ క్వాలిటీని తగ్గించే బ్యాడ్ హాబిట్స్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
* అధిక ఒత్తిడి : అందంగా, అట్రాక్టివ్‌గా కనిపించాలనుకోవడం మనుషుల సహజ లక్షణం. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటికీ జుట్టు రాలడం, ముఖంపై ముడతలు రావడం వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అందుకు గల ప్రధాన కరాణాల్లో ఒత్తిడి, అధిక రక్తపోటు, డిప్రెషన్ కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిని నిర్లక్ష్యం చేయడం మీలో వృద్ధాప్య ఛాయలను పెంచడమే కాకుండా జీవన ప్రమాణాన్ని తగ్గిస్తాయి. తరచుగా స్ట్రెస్‌కు గురికావడం అనేది మెదడులో రిలీజ్ అయ్యే హ్యాపీ హార్మోన్ల విడుదలను అడ్డుకుంటుంది. కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్ల రిలీజ్‌ను పెంచుతుంది. దీంతో చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేయడం లేదా ఒత్తిడి రహితంగా ఉండే జీవన విధానాన్ని అలవర్చుకోవడం చేయాలంటున్నారు నిపుణులు.
*మితిమీరిన ఆహారపు అలవాట్లు : మితిమీరిన ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రమే తరచుగా ఉపయోగించడం కూడా మీలో వృద్ధాప్య ఛాయలకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఈ రోజుల్లో చాలా మంది ఆహార పదార్థాలను నిల్వచేయడానికి, నీళ్లు తాగడానికి ప్లాస్టిక్ డబ్బాలు, బాటిల్స్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో నీరు తాగుతున్నప్పుడు అవి తరచుగా పెదవులకు తాకడం కారణంగా కూడా నోటి భాగంలో ముడతలు రావచ్చు. కాబట్టి గాజు లేదా వైడ్ -రిమ్డ్ కంటైనర్ వంటివి ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. సరైన పోషకాహారం బాడీకి అందకపోవడంవల్ల కూడా కండరాలు, ఎముక ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పైగా వీటిలో కదలికలు మందగించి క్రమంగా యవ్వన ఛాయలు కనుమరుగైపోతాయి.
*కెఫిన్, సోడా, నీళ్లు తాగే విధానం : ప్రతిరోజూ మీరు తాగే నీటిని బట్టి కూడా మీ చర్మ ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. సరిపడా తాగితే చర్మం, జుట్టు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అవసరం మేరకు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ పరిస్థతి శరీరంలో యవ్వన ఛాయలను దూరం చేస్తుంది. దీంతో వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం, చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాకేజ్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ వంటివి మీ గట్ హెల్త్‌ను దెబ్బతీస్తాయి.
* డైట్ సోడాలు : డైట్ సోడాలను ఎక్కువగా వినియోగించడం కూడా మెదడు పనితీరు మందగించేందుకు కారణం అవుతాయంటున్నారు నిపుణులు. రోజుకూ రెండుకంటే ఎక్కువగా డైట్ సోడా పోర్షన్స్ యూజ్ చేస్తే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అట్లనే అందంగా కనిపించాలని మనం మార్కెట్లో దొరికే రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులు కొంటుంటా. ఇవి కూడా రసాయనాలతో నిండి ఉంటాయి. వాటివల్ల సహజమైన హార్మోన్లకు ఆటంకం ఏర్పడి యవ్వన ఛాయలు కనుమరుగయ్యే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
*స్క్రీన్ల ముందు అధిక సమయం : ఈరోజుల్లో మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్, పలు రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి వాడటం సహజమైపోయింది. అయితే వీటిని ఓ పద్ధతి ప్రకారం వాడటంవల్ల ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా రాత్రింబవళ్లు అధిక సమయం వాటికే కేటాయించడం మీ వయస్సును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కంటి చూపు మందగించడం, ముఖం తరచుగా లైటింగ్‌కు ఎక్స్‌పోజ్ అవడంవల్ల యవ్వన ఛాయలు పోయి, వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. స్ర్కీన్ల నుంచి వెలువడే బ్లూ లైటింగ్ క్రమంగా నిద్రలేమికి, తద్వారా వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. దీంతోపాటు హెవీ వర్కవుట్స్, హెవీ మేకప్, శారరీక శ్రమ లేకపోవడం, అతి ఆలోచనలు, తరచుగా ఆందోళన చెందడం, టెన్షన్స్ వంటివి యవ్వన ఛాయలను దూరం చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే సరైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






