క్రొకడైల్ క్రాలింగ్.. చైనాలో వైరల్‌గా బ్యాక్ రిలీఫ్ ఎక్సర్‌సైజ్

by Disha Web Desk 7 |
క్రొకడైల్ క్రాలింగ్.. చైనాలో వైరల్‌గా బ్యాక్ రిలీఫ్ ఎక్సర్‌సైజ్
X

దిశ, ఫీచర్స్ : చైనాలో వేలాది మంది ప్రజలు 'క్రొకడైల్ క్రాలింగ్(Crocodile crawling)' క్లాసెస్‌కు హాజరవుతున్నారు. ఇది మొసలి మాదిరిగా కదలికలతో కూడిన ఒక విచిత్రమైన బ్యాక్ రిలీఫ్ ఎక్సర్‌సైజ్. డజన్ల కొద్దీ ప్రజలు పెద్ద పెద్ద సమూహాల్లో చేరి నాలుగు కాళ్లపై తిరుగుతున్న ఈ కొత్త హెల్త్ ట్రెండ్ ఇప్పుడు చైనాలో పాపులర్ అయింది. ఒకే విధమైన దుస్తులతో పాటు చేతులకు గ్లౌసెస్ ధరించిన జనాలు చేతులు, కాళ్లపై నెమ్మదిగా తిరుగుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. వెన్ను కండరాలను బలపరిచే ఈ ఎక్సర్‌‌సైజ్‌ను దీర్ఘకాలం క్రమం తప్పకుండా చేస్తే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందగలరని తెలుస్తోంది.

ఇక గతంలో వెన్నెముక సమస్యలతో ఇబ్బంది పడ్డాడని, అయితే సుమారు 8 నెలలపాటు ఈ వ్యాయామం ప్రాక్టీస్ చేసిన తర్వాత నొప్పి మాయమైందని జియాంగ్‌షాన్‌లోని 'క్రొకడైల్ వాక్' గ్రూప్ అధిపతి లి వీ వెల్లడించాడు. ఇది ఇంటర్‌వర్టెబ్రల్ డిస్క్‌పై ఒత్తిడిని తగ్గించడమే కాక పరిధీయ బలాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుందని బీజింగ్‌లోని పెకింగ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ చెన్ జిన్ తెలిపారు. అయినప్పటికీ మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడేవారికి ఈ మొసలి క్రాల్ సరిపోదని జిన్ హెచ్చరించాడు. ఎందుకంటే వ్యాయామం త్వరగా రక్తపోటును పెంచుతుంది. సాధారణ నడక కంటే గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.


Next Story