- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను కంటా.. ఇంటర్నెట్ పెంచుద్ది.. నేటి తల్లిదండ్రుల తీరు ఇదే...
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చూశాకా... అరే నూటికి నూరుపాళ్లు కరెక్ట్ చెప్పారు కదా అనిపించింది. ఆయన ఓ డాక్టర్ కాగా.. ఈ మధ్య పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా.. మా వాడికి మూడేళ్లు అయినా సరిగ్గా మాటలు రావట్లేదు.. మా పాప పిలిచినా పలకట్లేదు... నా పిల్లలకు ఏం తినాలో, ఎలా తినాలో కూడా తెలియదు.. ఆటిజం ఉందా ఏంటి.. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అయి ఉండొచ్చు.. సిగ్గు పడుతున్నాడో, తెలివి తక్కువగా ఉందో తెలియట్లేదు.. అనుకుంటూ పేరెంట్స్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ తో వస్తారట. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆరా తీస్తే.. అసలు విషయం ఆ అంతర్జాలంలో దాగి ఉందని గుర్తించారు డాక్టర్ గారు. అదేనండి ఇంటర్నెట్.
నెలల పిల్లలకే ఫోన్ అలవాటు??
అవును.. ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టిన మూడు నెలల నుంచే మొబైల్స్ చూసేస్తున్నారు. అందులో కనిపించే బొమ్మ, పాటకు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇక తల్లిదండ్రులు ఎలాగూ ఇద్దరు జాబ్ చేయాలి కాబట్టి పిల్లల పని త్వరగా పూర్తి చేసేందుకు మొబైల్, ఆన్ లైన్ యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ లేదా ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసి పెడితే చాలు.. అక్కడ వచ్చే వీడియోలు చూసుకుంటూ.. అమ్మానాన్న ఏది పెట్టినా తినేస్తారు ఆ పిల్లలు. అసలు ఏం తింటున్నామనే ఆలోచన కూడా ఉండదు. పెట్టిందల్లా మింగేస్తారు. దీనివల్ల పిల్లలకు మోటార్ స్కిల్స్ డెవలప్ కాకుండా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీరిక లేక??
వారితో ఆడుకునే తీరిక అసలే ఉండదు కాబట్టి ఓ కార్టూన్ ఛానల్ పెట్టేసి ఎవరి పని వారు చేసుకుంటారు. కనీసం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేయరు. ఇలా రోజులు గడిచిపోతుంటాయి. కనీసం పడుకునేటప్పుడు అయినా కథ చెప్పడమో.. పాటలు పాడుతూ జో కొట్టడమో చేస్తారా అంటే అదీ లేదు. ఓ మొబైల్ ముందు పెడితే
దాన్ని చూసి చూసి చార్జింగ్ అయిపోయాక పిల్లలే పడుకుంటారు. లేదంటే మరోసారి ఏడ్చి బజ్జుంటారు. అంటే ఆట, పాట.. రెండూ ఆన్ లైన్ లో దొరుకుతుంటే మేమెందుకులే అని తల్లిదండ్రులు లైట్ తీసుకోవడం, సోషల్ మీడియాలో అట్రాక్టివ్ కంటెంట్ ఉండటంతో పిల్లలు అటు వైపే మొగ్గు చూపడం జరుగుతుంది.
కష్ట్ హై.. నేను పలకను, వినను..
అంటే పరిస్థితి నేను కంటాను.. ఆన్ లైన్ పెంచుతుంది అన్నట్లుగా మారింది. దీంతో కమ్యూనికేషన్ తగ్గిపోవడం... కనీసం రోజుకు కొన్ని మాటలు అయినా మాట్లాడక పోవడం వల్ల పిల్లలకు మాటలు త్వరగా వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు నిపుణులు. అసలు వారికి నేర్పేందుకు ప్రయత్నం జరగనప్పుడు ఫలితం ఆశించడం కూడా తప్పు. ఇక గంటల తరబడి ఫోన్ లోనే ఉండటం వల్ల పిల్లలు అవే ఊహల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి పిలిచినా పట్టించుకోరు. ఇంకొందరు అటెన్షన్ కోల్పోతారు. ఎవరైనా అడుకుందామని పిలిచినా ఇంట్రెస్ట్ చూపరు.
బ్రెయిన్ ఎఫెక్ట్...
మొబైల్ వాడకం ఎక్కువైపోవడం వల్ల బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదాలు కూడా లేకపోలేదు. కంటి చూపు మందగిస్తుంది. వర్చువల్ ఆటిజం ప్రాబ్లమ్స్ రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇంకొందరు పిల్లలు మొండిగా తయారవుతున్నారు. అయితే ఇదంతా నిజమే కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో పోటీ పడాలంటే మాత్రం సెల్ ఫోన్స్, టాబ్లెట్స్ అవసరం అనేది కొందరి అభిప్రాయం. కానీ పిల్లల్లో ఎదుగుదల లోపాలు వస్తాయనేది నిపుణుల సూచన.