- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Summer Tips : వేసవిలో మొటిమలు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే ఈజీగా తగ్గుతాయంటున్న నిపుణులు
Summer Tips : వేసవిలో మొటిమలు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే ఈజీగా తగ్గుతాయంటున్న నిపుణులు

దిశ, ఫీచర్స్ : అసలే ఎండాకాలం. ఉక్కబోతలతో తరచుగా చెమటలు పట్టడం చర్మ సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ముఖంపై మొటిమలు పెరుగుతాయి. స్కిన్ టైప్‌ను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఈ సమస్య ప్రభావం చూపుతుంది. కాగా మహిళల్లో మరింత అధికంగా ఉండవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. పైగా నల్లటి మచ్చలు, మొటిమలు వంటివి అందాన్ని తగ్గిస్తాయని కూడా కొందరు ఫీలవుతుంటారు. అలాంటప్పుడు ఇంటి చిట్కాల ద్వారానే చక్కటి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. అదెలాగో చూద్దాం.
సాధారణంగానే వేసవిలో అధిక చెమటవల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. బయటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏదైనా పనిలో ఉన్నప్పుడు అలా ముఖం ఆయిలీగా మారిన వెంటనే కడుక్కునే పరిస్థితి ఉండదు. దీంతో చాలామంది అలాగే వదిలేస్తుంటారు. కానీ ముఖంపై పేరుకుపోయిన ఆ చెమట తర్వాత ఇన్ఫెక్షన్లకు, తద్వారా మొటిమలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలా ఏర్పడిన మొటిమలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన చర్మ సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం కొద్దిపాటి పసుపును, కలబంద గుజ్జును బాగా మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖంపై, మచ్చలు మొటిమలు ఉన్న శరీర భాగాలపై రాస్తే చాలు తొందరగా తగ్గిపోతాయి అంటున్నారు ఆయుర్వేదిక్ చిట్కా వైద్యులు. ఎందుకంటే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. ఇక కలబంద గుజ్జులో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతోపాటు చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచే పోషకాలు ఉంటాయి. ఈ రెండింటి మిశ్రమం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






