- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: వర్షాకాలం వచ్చిందంటే చాలు కొందరికి వదర భయం పుడుతుంది. సిటీలో ఉండేవారికైతే ఇదొక పెద్ద గందరగోళమే. ఎంతసేపూ మా బాల్కనీలో నీళ్లు నిలుస్తున్నాయి.. వరండాలోకి నీళ్లొస్తున్నాయి.. పైకప్పు నుంచి వరద దుంకుతుంది అనే ఆలోచిస్తాం కానీ.. ఆ నీటిని ఆదా చేసుకోవాలని అని ఆలోచించం. కానీ ఈ సీజన్లో అలా చేయకండి. నీటిని ఆదా చేయండి.
ఎందుకు ఆదా చేయాలి.?
ఇండియా ప్రతీ సంవత్సర సుమారు 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని అందుకుంటుంది. దీనిలో ఎక్కువ భాగం వృథాగా పోతుంది. నగరాలు వాన నీటితో నిండిపోతాయి. ఆ తర్వాత కొంతకాలానికి కనీసం చేతులు కడుక్కోవడానికి నీరు దొరకదు. ఆ వాన నీళ్లను ఒడిసిపట్టుకొని శుద్ధిచేసి.. బోరుబావులను రీచార్జ్ చేయడానికి.. నీటి బిల్లులు తగ్గించడానికి.. ఎండాకాలంలో ఇంటి అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు.
ఏమొస్తంది.?
వాన నీటిని ఒడిసిపట్టడం అనేది సరళమైన.. చాలా తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం. వర్షపు నీటిని నిల్వ చేయడం వల్ల ట్యాంకర్లు లేదా మున్సిపల్ నీటి సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. బోరుబావి లేదా ఊటబావులను రీచార్జ్ చేయొచ్చు. వాటర్ బిల్స్‌ను కూడా తగ్గించవచ్చు. భూగర్భజల సంరక్షణకు దోహదం చేయవచ్చు. వానాకాలంలో మీ ఇంటి చుట్టూ నీటి నిల్వను నివారించవచ్చు.
దశ 1:
పైకప్పు.. వాన నీళ్లను నిల్వ చేయడానికి సాధారణమైన ప్లేస్. ఎంత సమతల ఉపరితలం ఉందో చెక్ చేయండి. 25 మిల్లీమీటర్ల వర్షం పడితే 1000 చదరపు అడుగుల పైకప్పు నుంచి సుమారు 2000 లీటర్ల నీటిని సంగ్రహించొచ్చు. పైకప్పు శుభ్రంగా.. దుమ్ము.. దూళి లేకుండా చూసుకోవాలి. ఆకులు.. చెత్త పైపుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి ఔట్లెట్ల వద్ద మెష్ ఫిల్టర్లు అమర్చాలి.
దశ: 2
పైకప్పు మీద పడే వర్షం డౌన్‌పైపుల ద్వారా ప్రవహిస్తుంది. ఈ పైపులను మీ సంగ్రహణ వ్యవస్థకు అనుసంధానించాలి. నీటిని ట్యాంకులో నిల్వ చేయొచ్చు. పైకప్పు నుంచి వాన నీళ్లను సేకరించడానికి గట్టర్లు.. నీటిని తీసుకెళ్లే డౌన్ పైపులు.. ఫస్ట్ వానకు వచ్చే దూళిని వదిలించే ఫస్ట్ ఫ్లష్ డైవర్టర్.. నీటిని నిల్వచేయడానికి ముందు శుద్ధిచేసే ఫిల్టర్ చాంబర్ వంటివన్నీ ఉపయోగించి 10 నిమిషాల వర్షంతో 225 నీటిని సేకరించొచ్చు.
దశ: 3
ఇంటి ఉపయోగం కోసం నిల్వచేసిన నీటిని ట్యాంకులు.. బ్యారెల్స్‌లో సేకరించండి. ఆ నీటిని తోటపనికి వాడొచ్చు. ఫ్లషింగ్ కోసం వినియోగించవచ్చు. ఇంకా ఇంటిని.. వరండాలను శుభ్రం చేయడానికి వాడవచ్చు. బాగా శుద్ధిచేసి.. వంటకోసం కూడా ఉపయోగించవచ్చు. నీటిని నిల్వ చేయడం కోసం హైడెన్సిటీ పాలిథీన్ లేదా సిమెంట్ ట్యాంకులను ఒక ప్లాట్ ఫాంపై పెట్టి.. కవర చేయాలి.
దశ: 4
నిల్వచేయడం మీకు వీలుకాకపోతే ప్రకృతికి సాయం చేయండి. శుద్ధిచేసిన నీటిని బోరుబావి లేదా ఓపెన్ బావి వద్దనున్న రీచార్జ్ పిట్‌కు మళ్లించండి. సాధారణ రీచార్జ్ పిట్ మూడు నుంచి నాలుగు అడుగుల వెడల్పు.. ఆరు నుంచి ఎనిమిది అడుగుల లోతు ఉంటుంది. ఇందులో గ్రావెల్.. బొగ్గు.. ఇసుకను నింపుతారు. ఇది నెమ్మదిగా నేలలోకి ఇంకేలా చేస్తుంది.
దశ: 4
ఫిల్టరింగ్ చాలా ముఖ్యం. శుద్ధి చేయని వర్షపు నీరు పైపులను అడ్డుకోవచ్చు. లేదా రీచార్జ్ పిట్లను కలుషితం చేయొచ్చు. దీనిని మూడు పొరల్లో నిర్మించాలి. పై పొరలో యాక్టివేట్ చార్‌కోల్.. మధ్యపొరలో ఇసుక.. కిందిపొరలో రాళ్లు పేర్చాలి. ఫిల్టర్ బ్యారెల్‌ను తయారుచేయొచ్చు. లేదా రెడీమేడ్ ఫిల్టర్లను కొనుగోలు చేయొచ్చు. ఇవి రూ.1500 నుంచి రూ.5000 వరకు ఉంటాయి.
దశ 5:
డ్రైన్ పైపు నుంచి సేకరించిన వర్షపు నీటిని మంచి నిల్వ కోసం పైకప్పు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి వర్షాకాలానికి ముందు పైకప్పును శుభ్రం చేయడం మంచిది. మొదటి వర్షపు నీటిని వదిలేయాలి. ప్రతి పెద్ద వర్షం తర్వాత ఫిల్టర్లు.. పైపులను శుభ్రం చేయాలి. ట్యాంకులలో లీకులు.. అడ్డంకులను తనిఖీ చేయాలి. ఎంత నీటిని సేకరిస్తున్నారో గమనించాలి.






