హలో బ్రదర్స్.. మందు తాగేటప్పుడు స్టఫ్‌గా అవి తింటున్నారా?.. టూ డేంజరస్

by Sujitha Rachapalli |

మందు కొడుతున్నామంటే మంచింగ్ కంపల్సరీ. స్టఫ్ ఉంటేనే అసలైన కిక్. అయితే కొన్ని ఫుడ్స్ ఆల్కహాల్‌‌తో సెట్ కావని చెప్తున్నారు నిపుణులు. అలాంటివి అవాయిడ్ చేయకపోతే... అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ

హలో బ్రదర్స్.. మందు తాగేటప్పుడు స్టఫ్‌గా అవి తింటున్నారా?.. టూ డేంజరస్
X

దిశ, ఫీచర్స్ : మందు కొడుతున్నామంటే మంచింగ్ కంపల్సరీ. స్టఫ్ ఉంటేనే అసలైన కిక్. అయితే కొన్ని ఫుడ్స్ ఆల్కహాల్‌‌తో సెట్ కావని చెప్తున్నారు నిపుణులు. అలాంటివి అవాయిడ్ చేయకపోతే... అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి ఆహారాలు మందుతో కలిపి తీసుకుంటే రియాక్షన్స్‌కు దారితీస్తాయో చూద్దాం.

డైరీ ప్రొడక్ట్స్

పాల ఉత్పత్తులను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో చికాకు కలుగుతుంది. తీవ్రమైన కడుపు నొప్పి, మలబద్ధకం వస్తుంది.

పిజ్జా

ఇది షాకింగ్ అనిపించొచ్చు. కానీ ఆల్కహాల్‌లోకి పిజ్జాను స్టఫ్‌గా తీసుకోవడం మంచిది కాదు. పిండిలో పులియబెట్టే పదార్థాల వాడకం మందుతో సెట్ కాక కడుపు నొప్పికి దారితీస్తుంది.

ఫ్రైడ్ ఫుడ్స్

పకోడి లాంటి ఫ్రైలను ఆల్కహాల్‌తో మంచి కాంబినేషన్‌గా పరిగణిస్తారు. కానీ అవి కలిసి తిన్నప్పుడు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ప్రేగులపై ఒత్తిడిని పెంచుతాయి.

సాల్టీ ఫుడ్స్

ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. ఇది మందు ఎక్కువగా తాగేందుకు కారణమవుతాయి. ఈ పద్ధతికి ఆరోగ్యానికి మంచిదికాదు.

బీన్స్

వైన్ తీసుకునేటప్పుడు.. బీన్ సలాడ్ లేదా కర్రీ మంచింగ్‌గా వాడొద్దు. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఆల్కహాల్‌లోని టానిన్ అనే సమ్మేళనం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా అసౌకర్యం కలుగుతుంది.

ఆరెంజ్ సలాడ్

ఇది రిఫ్రెష్‌గా అనిపించినా.. ఆల్కహాల్‌తో కలిపి తీసుకుంటే నారింజలోని ఆమ్లం జీర్ణ సమస్యలను రేకెత్తిస్తుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

సూపర్ స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్ రుచికరంగా ఉన్నప్పటికీ మందు తాగేటప్పుడు తీసుకుంటే మాత్రం కడుపు పొరకు చికాకు కలిగిస్తాయి. పొట్టలో అసౌకర్యానికి దారితీస్తాయి.

చాక్లెట్

పలు అధ్యయనాల ప్రకారం.. చాక్లెట్, కెఫిన్ లేదా కోకో ఆల్కహాల్‌తో తీసుకుంటే జీర్ణ-పేగు సమస్యలను తీవ్రతరం చేస్తుంది.

Next Story