Viral: మనుషులకు సహాయంగా రోబోలు.. అక్కడి CAFE సర్వీసుల్లో కీ రోల్!

by Javid Pasha |   (  Updated:2025-11-11 07:27:04  IST  )

జపాన్‌లోని ఒక అత్యాధునిక కేఫెలో పక్షవాత బాధితులు సైతం ఉద్యోగులుగా ఉంటున్నారు. రోబోల ద్వారా సేవలు అందిస్తున్నారు.

Viral: మనుషులకు సహాయంగా రోబోలు.. అక్కడి CAFE సర్వీసుల్లో కీ రోల్!
X

దిశ, ఫీచర్స్ : అవి చిన్న హోటల్స్ అయినా.. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయినా సాధారణంగా అన్ని అర్హతలతో పాటు ఆరోగ్యం, బాడీ ఫిట్‌నెస్ ఉన్న ఉద్యోగులను నియమించుకుంటాయి. వారి ద్వారానే టీ, స్నాక్స్, డ్రింక్స్ ఇలా అన్ని రకాల సేవలను కస్టమర్లకు అందిస్తాయి. కానీ జపాన్‌లోని ఒక అత్యాధునిక కేఫె(Avatar Robot Cafe DAWN) మాత్రం ఇందుకు భిన్నంగా పనికి చేతగాని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను, పక్షవాతం వచ్చిన వారిని కూడా ఉద్యోగులుగా నియమించుకుంటూ మానవత్వం చాటుతోంది. పైగా సదరు ఉద్యోగులు స్వయంగా చేయలేని పనులకోసం రోబోలను ఉపయోగించుకుంటోంది.

‘అవతార్ రోబోట్ కేఫె’ పేరుతో పిలువబడే జపాన్‌లోని రెస్టారెంట్‌లో ఎంతో మంది పక్షవాత బాధితులు సైతం ఉద్యోగులుగా ఉంటున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. మానవత్వానికి నిదర్శనంగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే పక్షవాత బాధితులు స్వయంగా కస్టమర్లకు సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. వారు తమ ఇండ్ల వద్ద లేదా కేఫెలోని ఒక గదిలో కూర్చొని రోబోటిక్ సర్వర్లను నియంత్రించడం ద్వారా సేవలు అందించ్చు. ఆధునిక సాంకేతికతను, రోబోటిక్ సేవలను ఉపయోగించుకోవడమే కాకుండా, పక్షవాతం బాధితులకు, వికలాంగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న తీరు రోబోటిక్ టెక్నాలజీ ప్రాధాన్యతను వెల్లడిస్తోంది. అంతేకాకుండా ఏఐ ఆధారిత రోబోటిక్ టెక్నాలజీ కేవలం ఉద్యోగాలను పోగొడుతుందనే అపోహలను తొలగించడంతోపాటు మానవత్వాన్ని నిలబెట్టడంలో దాని పాత్రను వివరిస్తున్నదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story