- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్కార్ ఫౌండేషన్.. నో స్కూల్.. నో ఫుట్‌బాల్.!
ఇంకెవరి జీవితాలు ఆగం కావద్దని డిసైడ్ అయ్యాడు

దిశ, ఫీచర్స్: యువత మందు, విందుకు అలవాటై మంచి భవిష్యత్‌ను ఆగం చేసుకుంటున్నారు. కొందరు చదువుకోవాల్సిన వయసులోనే పెండ్లిళ్లు చేసుకొని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూ పెరిగాడు ముంబైలోని స్లమ్ ఏరియాకు చెందిన అశోక్ రాథోడ్. దురదృష్టవశాత్తూ అతడు కూడా కాలేజీ డ్రాపౌట్. ఇలా ఇంకెవరి జీవితాలు ఆగం కావద్దని డిసైడ్ అయ్యాడు.
రియల్ హీరో అశోక్..
మద్యపానం, బాల్య వివాహాలు, డ్రాపౌట్ వంటి సమస్యల నుంచి యవతను కాపాడటమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు అశోక్. 18 ఏళ్ల వయసులో ఈ ప్రయత్నం మొదలైంది. 2010లో ''ఆస్కార్ ఫౌండేషన్'' స్టార్ట్ చేశాడు. పిల్లలు మైదానంలో ఉంటే వీధుల్లో ఉండరు అనే ఆలోచనతో వారాంతాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. చదువు, ఆటలను కలిపితే డ్రాపౌట్స్ తగ్గిపోతాయనేది అశోక్ ఆలోచన. ఆయన మిషన్‌కు ఆకర్షితులై మొదటగా 18 మంది జతకట్టారు. ఆ తర్వాత వందలాది మంది చేరారు. ఆ కృషి ఫలితంగా "రియల్ హీరో అవార్డు" అందుకున్నాడు.
నో స్కూల్.. నో ఫుట్‌బాల్..
"రియల్ హీరో అవార్డు"తో పాటు అశోక్‌కు రూ. 3.45 లక్షలు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఐతే.. దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోలేదు. వందలాది మందికి బూట్లు, జెర్సీలు కొన్నాడు. చిన్నపాటి కమ్యూనిటీ సెంటర్ కూడా కట్టాడు. ఫౌండేషన్ సేవలను మరింత విస్తరించేందుకు ''నో స్కూల్.. నో ఫుట్‌బాల్'' ఛాలెంజ్ స్టార్ట్ చేశాడు. ఐతే.. ఫుట్‌బాల్ పేరుతో యువతను చెడగొడుతున్నారని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అశోక్ వెనక్కి తగ్గలేదు. పిల్లలను ఫుట్‌బాల్‌కు అలవాటు చేసి.. ఆ తర్వాత ''స్కూల్‌కు వెళ్లకపోతే.. ఫుట్‌బాల్ ఉండదు'' అనే నియమాన్ని దినచర్యగా మార్చాడు.
20 వేల మంది పిల్లలను..
'ఆస్కార్ ఫౌండేషన్'' ద్వారా పిల్లలు సంతోషంగా మారారు. చదువుపై శ్రద్ధ పెరిగింది. టీమ్‌వర్క్, క్రమశిక్షణ, గౌరవం నేర్చుకున్నారు. డామన్ డయ్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సూసైడ్‌ల నివారణ, హాజరు శాతం పెంచడం వంటి సమస్యలు పరిష్కారం చూపాల్సిందిగా కోరింది. ''ఆస్కార్ ఫౌండేషన్'' ద్వారా అశోక్ రాథోడ్ సారథ్యంలో 154 మంది టీచర్లకు క్రీడలు, లైఫ్ స్కిల్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఫలితం.. రెండు సంవత్సరాల్లో ఒక్క సూసైడ్ కేసూ లేదు. కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, డామన్ డయ్యూలో ఈ కార్యక్రమం ద్వారా 600 మంది టీచర్లు శిక్షణ పొంది.. 20 వేల మంది పిల్లలను మార్చగలిగారు.
జీవితాల్లో మార్పు..
అశోక్ రాథోడ్ ''ఆస్కార్ ఫౌండేషన్'' ద్వారా ఫుట్‌బాల్ ఆడించి, చదువు చెప్పించడమే కాదు.. తన మెంటార్‌షిప్‌తో పేదరికాన్ని రూపు మాపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దీనికోసం 37 ఏళ్ల అశోక్.. 18 ఏళ్లలోని ఫైర్‌తోనే పని చేస్తున్నాడు. స్పోర్ట్ అనేది ఒక సౌకర్యం కాదు. చదువులా అది అందరికీ ఉపయోగపడే ఒక అవసరం అంటున్నాడు అశోక్. చదువు స్కూల్‌ను దగ్గర చేస్తే.. ఫుట్‌బాల్ ఆత్మస్థయిర్యంతో జీవించేలా చేస్తుంది. అందుకే ఈ రెండింటినీ జోడించుకొని జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు. త్వరలోనే దీనిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.






