2023 మోస్ట్ సెక్సీయెస్ట్ ఉమెన్‌‌‌గా 35 ఏళ్ల మోడల్.. యాష్లే గ్రాహం

by Disha Web Desk 7 |
2023 మోస్ట్ సెక్సీయెస్ట్ ఉమెన్‌‌‌గా 35 ఏళ్ల మోడల్.. యాష్లే గ్రాహం
X

దిశ, సినిమా : నెబ్రాస్కాకు చెందిన స్టార్ మోడల్ యాష్లే గ్రాహం అరుదైన అవకాశం దక్కించుకుంది. ‘మాగ్జిమ్ 2023’ విడుదల చేసిన వంద మంది అందగత్తెలతో కూడిన జాబితాలో మోస్ట్ సెక్సీయెస్ట్ ఉమెన్‌గా ఎంపికైంది. యూఎస్‌ స్టేట్స్‌కు చెందిన 35 ఏళ్ల మోడల్ ప్లస్-సైజ్ షేప్స్ కలిగివుండి పాజిటీవిటీ బాడీతో మహిళలకు రోల్ మోడల్‌గా నిలినందుకుగాను 2023 కిరీటాన్ని సొంతం చేసుకున్నట్లు మాగ్జిమ్ నిర్వాహకులు వెల్లడించారు.

కాగా ఈ అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తం చేసిన యాష్లే.. ‘మన శరీరాలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి మన బాడీని ఒక సాధనంగా ఉపయోగించాలి. అదే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. అద్భుతమైన లుక్స్ మాత్రమే కాదు. మహిళలు బాడీ పాజిటివిటీ గురించి బహిరంగంగా మాట్లాడటం చాలా ముఖ్యం’ అంటూ చెప్పుకొచ్చింది. 12 ఏళ్లకే ఫ్యాషన్ పరిశ్రమలోకి వచ్చిన ఆమె.. ఎన్నో అడ్డంకులను బద్దలు కొడుతూ సరికొత్త ఆవిష్కరణలతో తనదైన సత్తా చాటుతోంది.



Next Story