- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో నీకు నువ్వే శత్రువు.. కాస్త చూసుకో బ్రో..
టాలెంట్ ఉన్నా వర్క్ ప్లేస్‌లో నెక్స్ట్ లెవల్‌కు రీచ్ కాలేరు చాలా మంది. ఎక్సలెంట్ అవుట్ పుట్ ఇచ్చినా సరే ఎక్కడో ఒకచోట వెనకబడుతూనే ఉంటారు. అలాగని కొలిగ్స్ అన్యాయం చేస్తున్నారా? ఏమైనా పాలిటిక్స్ ప్లే అవుతున్నాయా? అంటే కొన్నిసార్లు అలాకూడా కావొచ్చు కానీ చాలా సమయాల్లో మనకు మనమే

దిశ, ఫీచర్స్ : టాలెంట్ ఉన్నా వర్క్ ప్లేస్‌లో నెక్స్ట్ లెవల్‌కు రీచ్ కాలేరు చాలా మంది. ఎక్సలెంట్ అవుట్ పుట్ ఇచ్చినా సరే ఎక్కడో ఒకచోట వెనకబడుతూనే ఉంటారు. అలాగని కొలిగ్స్ అన్యాయం చేస్తున్నారా? ఏమైనా పాలిటిక్స్ ప్లే అవుతున్నాయా? అంటే కొన్నిసార్లు అలాకూడా కావొచ్చు కానీ చాలా సమయాల్లో మనకు మనమే శత్రువుగా మారుతాం. వర్క్ లైఫ్‌లో మనం చేసే కొన్ని మిస్టేక్స్.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా చేస్తుంటాయి. న్యూ పొజిషన్‌కు వెళ్లలేము.. అక్కడి నుంచి బయటకు రాలేము. ఇంతకీ కెరీర్ గ్రోత్ కాకుండా చేస్తున్న తప్పులు ఏంటి? మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?
కొత్తగా నేర్చుకో..
ఎంత ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీకి అనుగుణంగా అప్‌డేట్ కాకపోతే కష్టమే. న్యూ స్కిల్స్ నేర్చుకోకుండా.. నాకు అన్నీ తెలుసని.. ఆటిట్యూడ్ చూపిస్తే అదే పొజిషన్‌లో ఉండిపోతారు. ఈ పద్ధతి మిమ్మల్ని అరోగెంట్‌గా చూపిస్తుంది. మీతో కొలిగ్స్, బాస్ అప్రోచ్ అయ్యేందుకు అడ్డుపడుతుంది. అందుకే కొత్తగా నేర్చుకునేందుకు ప్రయత్నించండి. అవసరమైతే ఇతరుల సహాయం అడగండి. ఈ విధానం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్‌కు హెల్ప్ అవుతుంది.
ప్రొఫెషనల్ కనెక్షన్స్ వద్దనకు..
కొలిగ్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు ఇబ్బంది పడ్డామంటే వర్క్ ప్లేస్‌లో ఐసోలేట్ అయిపోవచ్చు. ఒంటరిగా పని చేసుకునేందుకు కష్టపడొచ్చు. అలాకాకుండా హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటేన్ చేస్తే టీమ్ వర్క్‌తో సులభంగా సక్సెస్ సొంతం అవుతుంది. ఇతరులతో క్రియేటివ్ పరంగా వివాదాలు ఉంటే సరిదిద్దుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరే నెక్స్ట్ టీమ్ లీడర్.
ఎమోషన్స్ జేబులో పెట్టుకోండి
కోపం, ఫ్రస్ట్రేషన్ లాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ చూపిస్తే ఇతరులు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ కావొచ్చు. ఇదే హ్యాబిట్‌గా మారితే మీరు ప్రెజర్, స్ట్రెస్ హ్యాండిల్ చేయలేరనే ముద్రపడిపోతుంది. అందుకే ఇలాంటి భావోద్వేగాలు నియంత్రించడం అలవాటు చేసుకోండి. ప్రొఫెషనల్ మ్యానర్‌లో ఫీలింగ్స్ షేర్ చేసుకోండి.
కంట్రిబ్యూషన్ అవసరం
కొత్తగా ఆలోచించలేదంటే.. ఒకవేళ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నా షేర్ చేసుకోకుండా సైలెంట్‌గా ఉండటం మీరు చేసే పెద్ద మిస్టేక్ అవుతుంది. టీమ్ అండ్ బాస్‌తో ఎంగేజ్ కాలేరని, అక్కడ ఉండేందుకు అర్హులు కాలేరని అనుకోవచ్చు. నిశ్శబ్దంగా ఉండకుండా డిస్కషన్స్‌లో పాల్గొనండి. డౌట్స్ ఉంటే అడగండి. టీమ్ ఎదిగేందుకు మీ కంట్రిబ్యూషన్ ఇవ్వండి.
బ్లేమింగ్ గేమ్ వద్దు
పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఇతరుల వైపు వేలెత్తి చూపడం పెద్ద మిస్టేక్. ఇలాంటి బ్లేమింగ్ గేమ్ వల్ల మీతో కలిసి వర్క్ చేయడం కష్టమే అనుకుంటారు కొలిగ్స్. అలాకాకుండా చేసిన తప్పులకు బాధ్యత వహించి.. తప్పుల నుంచి నేర్చుకుంటూ.. ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవడం.. మిమ్మల్ని లీడర్‌గా నిలబెడుతుంది. కెరీర్ గ్రోత్‌కు బాటలు వేస్తుంది.






