Summer Tips: బీ‌కేర్‌ఫుల్.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అతిగా వాడుతున్నారా..?

by Kodari Anjali |

ప్రస్తుత రోజుల్లో శీతాకాలం, వర్షాకాల్లోనే ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ వెడేక్కడం సాధారణం అయిపోయింది.

Summer Tips: బీ‌కేర్‌ఫుల్.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అతిగా వాడుతున్నారా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో శీతాకాలం, వర్షాకాల్లోనే ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ (Electronics Gadgets) వెడేక్కడం సాధారణం అయిపోయింది. పైగా ఇది వేసవికాలం. వాతావరణమే వేడివేడిగా ఉంటుంది. తద్వారా ఫోన్లపై కూడా వేడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాగా సమ్మర్‌లో కంప్యూటర్లు (Computers), స్మార్ట్ మొబైల్స్ (Smart mobiles), ల్యాప్ టాప్‌లు (Laptops) త్వరగా వేడెక్కే చాన్స్ ఉంటుంది. ఏసీలు లేని చోట్ల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చల్లగా ఉంచేందుకు కొన్ని టిప్స పాటించాలని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటాయి.

కాగా ఎలక్ట్రానిక్ పరికరాన్ని వాడాక వెంటిలేషన్ (ventilation) ఉన్న ప్లేస్‌లో పెట్టాలి. గోడకు అంటిపెట్టకుండా వాటిపై సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. అలాగే ఒక దానిపై మరొకటి పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. బాగా వేడెక్కిందని అనిపిస్తే ఉపయోగించడం ఆపాలి. వేడి తగ్గినాక వాడటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వేడెక్కడం తగ్గుతుంది.

అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను సెకండ్ హ్యాండ్‌లో కొనవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటివల్ల లాభాలు పక్కన పెడితే నష్టాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత రోజుల్లో సెకండ్ హ్యాండ్ వాటికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. మొబైల్ ఫోన్లు, కార్లు, బైకులు, గృహోపకరణాలు, కంప్యూటర్లు.. ఇలా ప్రతి ఒక్క వస్తువును కొంటున్నారు జనాలు. కానీ అధిక వేడి వల్ల ఇవి కూడా పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Next Story