వేసవిలో మీ పిల్లలను ఇతర చోట్లకు పంపుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

by Disha Web Desk 6 |
వేసవిలో మీ పిల్లలను ఇతర చోట్లకు పంపుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: ఎండాకాలం కాలం రానే వచ్చింది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు అప్పుడే పాఠశాలలు ఒంటిపూట పెట్టేశారు. అయితే ఏప్రిల్ చివరి వరకు స్కూల్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయి సమ్మర్ సెలవులు కూడా ప్రకటిస్తారు. పిల్లలు సమ్మర్ హాలీడేస్ వస్తున్నాయంటే చాలు ఇక చదువుతో సంబంధం లేకుండా దాదాపు రెండు నెలల పాటు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం సమ్మర్ సెలవుల్లో పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ ఇంటికో లేదా ఏదైనా క్యాంప్‌ల్లో జాయిన్ చేయాలని ప్లాన్ చేస్తారు. కొందరు మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పటికీ చదువుకు దూరమవడంతో పాటుగా బంధాలను కూడా పట్టించుకోకుండా ఫోన్‌కు అడిక్ట్ అయిపోతుంటారు. దీంతో ఫోన్‌లో వీడియోలు, గేమ్స్ ఆడుతూ తిండి కూడా తినకుండా అందులో మునిగిపోతుంటారు. అలా కాకుండా సమ్మర్‌లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుని వారితో గడపడం వల్ల చాలా మార్పులు వస్తాయి. అంతేకాకుండా మీరు పిల్లలకు దగ్గర కావడంతో పాటుగా వారికి ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని దానిపై పట్టు సాధించేలా మీ పిల్లలను సిద్ధం చేయవచ్చును.

* అయితే పిల్లలు సెలవుల్లో ఇంట్లోనే ఉంటూ బద్దకంగా తయారవుతారు. దీంతో తిన్న చోట నుంచి కదలకుండా అన్నీ తమవద్దకే తీసుకుని రమ్మని చెబుతుంటారు. అలా చేయడం వల్ల వారిలో బద్ధకం ఎక్కువ అవడంతో పాటుగా ఏ పని మీద శ్రద్ధ లేకుండా అవుతుంది. కాబట్టి ఈ క్రమంలో తల్లిదండ్రులు సాయంత్రం పూట బయటకు తీసుకుని వెళ్లాలి. అలాగే వారు ఏదైనా కొత్తగా నేర్చుకునే అవకాశం ఉన్నచోటకు తీసుకెళ్తే ఉపయోగకరంగా ఉంటుంది.

* అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో అని చూడకుండా ఉండకూడదు. వారితో తల్లిదండ్రులు మాట్లాడి కొత్త విషయాలు నేర్పాలి. అలా చేయడం వల్ల మనతో వారు అన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతారు. దీంతో ఏది చేయడం ఇంట్రెస్ట్ ఉందో చెబుతారు. దాని వల్ల మనం వారు ఏం చేయాలనుకుంటున్నారో దానిపై వారి ఫోకస్‌‌ను పెరిగేలా చేయవచ్చును.

*అయితే కొంతమంది పిల్లలు బొమ్మలు గీయడం, మరికొందరికి డ్యాన్స్ చేయడం వంటి వాటిని ఇష్టపడతారు. కాబట్టి వారికి ఇంట్రెస్ట్ ఉన్నదానిని చేసేలా ప్రోత్సహించండి.

* సమ్మర్ హాలీడేస్ కనక మిస్ అయిందంటే మళ్ళీ ఒక ఏడాది ఆగాల్సిందే. కాబట్టి సమయం దొరికినప్పుడే ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనిని మిస్ చేసేకోకూడదు అది మీ పిల్లలకు మంచి కాదు. ఎందుకంటే.. వారు ఈ సమయంలోనే ఏదైనా ఇష్టంగా నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మళ్లీ పాఠశాలలు స్టార్ట్ అయితే ట్యూషన్లు, పరీక్షలు అంటూ బిజీ అయిపోతారు.

* అయితే కొందరు సీటిల్లో ఉంటారు కాబట్టి ఎక్కడ చూసినా పెద్ద భవనాలు ఉంటాయి. కానీ ఎక్కువగా చెట్లు ఉండవు దీంతో వారు ప్రకృతి అందాలకు దూరంగా ఉండి నాలుగు గోడల మధ్యనే ఉండటానికే ఇష్టపడతారు. కాబట్టి వారి మానాన వారిని వదిలేయకుండా ప్రకృతిలో సమయం గడపడం వల్ల అది మోమరబుల్‌గా ఎప్పటికీ నిలిచిపోతుంది. అలా చేయడం వల్ల కాలుష్యంతో నిండిపోయిన గాలిని కాకుండా స్వఛ్చమైనదాన్ని తీసుకోవచ్చు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది.

* తల్లిదండ్రులు వీలు చేసుకుని మరీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం తో పాటుగా వారికి సమయం కేటాయించడం వల్ల మీ మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది. అలాగే మీతో అన్ని చెప్పుకోవచ్చు అన్న భావన వారిలో కలుగుతుంది. దీంతో ఏదైనా చేసినా కానీ మిమ్మల్ని ఫ్రెండ్‌గా భావించి అన్ని విషయాలను చెబుతారు.


Next Story

Most Viewed