- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ్మర్‌లో కూర్గ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే!
వేసవి సెలవులు (Summer Holidays) వచ్చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు (Summer Holidays) వచ్చేశాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. కుటుంబం, స్నేహితులతో ఎక్కడికైనా చల్లటి ప్రదేశాలకు టూర్‌కి (Tour) వెళ్లి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? ఇక శీతల ప్రాంతాలనగానే చాలా మందికి.. కునుమానాలి, సిమ్లా ఇలా నార్త్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ మన సౌత్‌లో కూడా వేసవి విడిదికి ఉత్తమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో కూర్గ్ (Coorg) ఒకటి. 'ఇండియన్ స్కాట్లాండ్'గా (Indian Scotland) పిలిచే ఈ ప్రాంతంలో హిల్ స్టేషన్ అత్యంత ఆకట్టుకుంటుంది. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాలు, మత్తక్కించే కాఫీ తోటలు, అందమైన జలపాతాలు, చారిత్రక కట్టడాలు పర్యాటకులకు మధురమైన అనుభూతిలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీ కోసం సూపర్ టూర్ ప్యాకేజీని (Tour package) తీసుకొచ్చింది. 'కాఫీ విత్ కర్ణాటక' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ టూర్ ప్యాకేజీలో మీరు మైసూర్ అందాలను కూడా లుక్కేయొచ్చు. మరీ ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు, ఏఏ ప్రాంతాలు కవర్ చేయవచ్చు? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
* IRCTC తీసుకొచ్చిన కాఫీ విత్ కర్ణాటక ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25వ తేదీల్లో కాచిగూడ నుంచి రైలు అందుబాటులో ఉంటుంది.
* ఇక ఇందులో మొదటి రోజు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి రైలు రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
* రెండో రోజు ఉదయం 10 గంటలకు రైలు మైసూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్ వెళ్తారు. మధ్యాహ్నం అక్కడి హోటల్‌లో చెకిన్ తర్వాత అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయం సందర్శించవచ్చు. రాత్రి కూర్గ్‌లోనే బస ఉంటుంది.
* మూడో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తలకావేరి, భాగమండల, రాజా సీట్ పార్క్‌ను సందర్శిస్తారు. మూడో రోజు రాత్రి కూడా బస కూర్గ్‌లోనే ఉంటుంది.
* నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అయ్యి మైసూర్‌కి బయలుదేరుతారు. ఆ దారిలో కావేరి నిసర్గధామ, టిబెటెన్ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్ సందర్శించొచ్చు. రాత్రి బస మైసూరులో ఉంటుంది.
* ఐదో రోజు ఉదయం చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తారు. మధ్యాహ్నాం 3.15 గంటలకు రైలు మైసూర్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణించి ఆరో రోజు ఉదయం 5.40గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ప్యాకేజీ ధర వివరాలు:
* కంఫర్ట్ 3 ఏసీలో అయితే.. సింగిల్ షేరింగ్‌కు రూ.33,160గా నిర్ణయించారు. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.18,730, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,690గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.11,140, విత్ అవుట్ బెడ్ రూ.9,530గా నిర్ణయించారు.
* స్టాండర్డ్ స్లిపర్ క్లాస్ అయితే.. సింగిల్ షేరింగ్‌కు రూ.31,140, డబుల్ షేరింగ్‌కు రూ.16,710, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,670గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.9,120, విత్ అవుట్ బెడ్ రూ.7,510గా నిర్ణయించారు.
ప్యాకేజీలో ఉండేవి సౌకర్యాలు:
* ట్రైన్ టికెట్లు (కాటిగూడ నుంచి మైసూర్.. మైసూర్ నుంచి కాచిగూడ)
* పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి ఏసీ వాహనం
* హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్.. లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్స్ కూడా ప్రయాణికులే కొనాలి.






