- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైట్ చేస్తున్నారా... అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ విషయం ప్రతి ఒక్కరూ నిత్యం చెబుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో.... పెద్దవాళ్లు కూడా ఇదే విషయాన్ని చెబుతూ

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ విషయం ప్రతి ఒక్కరూ నిత్యం చెబుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో.... పెద్దవాళ్లు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుత యువత వీటన్నిటిని పెడచెవిన పెట్టి అనారోగ్యం పాలవుతున్నారు. ఏమాత్రం డైట్ ఫాలో కాకుండా... కలుషిత ఆహారం తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలో... కొంతమంది డైట్ పేరుతో ఆహారం మానేసి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. డైట్ అనేది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. డైట్ అంటే భోజనం మానేస్తూ తినకుండా ఉండటం కాదని... సమయానికి పరిమితంగా తినడమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే స్వీట్లు అలాగే కొవ్వు లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. కడుపు మాడ్చుకొని.... డైట్ పేరుతో.. ఆ భోజనం మానేస్తే ప్రమాదం తప్పదని అంటున్నారు. అలా చేస్తే కొత్త రోగాలు రావడం తప్ప... లాభాలు ఏం ఉండవని చెబుతున్నారు.






