- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ లక్షణాలు ఉన్న వాళ్లను పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇదే!?
ప్రేమ, పెళ్లి లాంటి విషయాల్లో నమ్మకం చాలా ముఖ్యం.

దిశ,వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుక చాలా ముఖ్యమైనది. వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు వ్యక్తులు చివరి వరకు జంటగా జీవనం సాగిస్తారు. అంతేకాదు పెళ్లితో రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడుతుంది. పెళ్లి అంటేనే ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలకు సంబంధించిన ముఖ్యమైన అంశం కాబట్టి హిందూ మతంలో వివాహ బంధానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. ఒకప్పుడు అమ్మాయికీ లేదా అబ్బాయికీ పెళ్లి చేయాలంటే పెద్దలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవారు. కానీ ప్రస్తుతం ఒక్క తరం బాగుంటే చాలు అని భావిస్తున్నారు.
ఆనాడు అలానే పెళ్లిళ్లు చేసేవాళ్ళు. అంతేకాదు అప్పటి పెళ్లిళ్లు ఎక్కువగా మేనరికంలోనే జరిగేవి. మేనబావ లేదా మేనమామలను వివాహం చేసుకునేవారు. పెద్దల సమక్షంలో ఐదు రోజులు అంగరంగా వైభవంగా పెళ్లి జరిపించేవారు. ఆనాడు మేనరికం పెళ్లిళ్లకు మొగ్గు చూపాడానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. తమ ఆస్తి తమ కుటుంబంలోని వారికే చెందాలనే ఆశతో, మన కళ్లముందే పెరిగిన పిల్లలు కనుక వారి గుణగణాలు ముందే తెలుస్తాయని, దీనివల్ల వివాహ బంధంలో సమస్యలు రావని పెద్దలు భావించేవారు.
కానీ, ఆనాటి వివాహాలకు ఇప్పటి పెళ్లిళ్లకూ పూర్తిగా భిన్నంగా ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ప్రస్తుత కాలంలో ఏకంగా రాష్ట్రాలు దాటి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి/అబ్బాయి కోసం ఎక్కడికి వెళ్లాడినికైనా సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో కుల మతాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ పరిచయం లేని, దూరం వ్యక్తులను పెళ్లి చేసుకునే ముందు కొన్ని లక్షణాలను బట్టి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లికి ముందు అబ్బాయికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అని కచ్చితంగా తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. చెడు అలవాట్ల వల్ల కుటుంబంలో గొడవలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా చేసుకోబోయే అబ్బాయికి లేదా అమ్మాయి గతంలో ఎవరినైనా ప్రేమించారా? ప్రస్తుతం వారి మనసులో ఎవరైనా ఉన్నారా అనే విషయాలు కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి లాంటి విషయాల్లో నమ్మకం చాలా ముఖ్యం. మీరు చెప్పే విషయాలను రహస్యంగా ఉంచే గుణం, వారి భావోద్వేగాలను మీతో సరదాగా పంచుకోనే లక్షణాలు ఉన్న మహిళలు జీవితాంతం మీకు తోడుగా ఉంటారు.
ఈ లక్షణం ఉన్న మహిళలను అసలు వదులుకోకండి. ఏ విషయంలోనైనా కూడా కేర్ చూపిస్తూ సపోర్ట్ చేయడం, ప్రేమగా దగ్గరికి తీసుకోవడం లాంటివి చేయాలి. కష్టాల్లో కూడా కేరింగ్ చూపిస్తూ మీతో ప్రేమగా ఉండే వారిని మిస్ చేసుకోవద్దు.వీటితోపాటు తమకు కాబోయే వారు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారా? ఎక్కువగా కోప్పడతారా? లాంటి లక్షణాలు కూడా ఉన్నాయో లేదో తెలుసుకుంటే మంచిదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.






