- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిన్నటి కూరలను ఈ రోజు తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త
తాజా ఆహారమే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తరచూ సూచిస్తూనే ఉంటారు. కానీ చాలా మంది బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తూ ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని సిద్ధం చేసుకుని ఉదయం, సాయంత్రం వాటినే తింటుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: తాజా ఆహారమే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తరచూ సూచిస్తూనే ఉంటారు. కానీ చాలా మంది బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తూ ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని సిద్ధం చేసుకుని ఉదయం, సాయంత్రం వాటినే తింటుంటారు. మరి కొందరు మిగిలిన ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుని ఒకటి, రెండు రోజులు లాగించేస్తుంటారు. నాన్ వెజ్ విషయంలో ఇలాంటి సందర్భాలు అనేకం జరుగుతుంటాయి. అయితే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాన్ని ఒక పూట కంటే ఎక్కువ సార్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహార పదార్ధాలు ఎక్కువగా తింటే ఇన్ఫెక్షన్లు రావడం ఖాయం అంటున్నారు వైద్యులు. కూర వండిన తర్వాత గంటగంటకు దానిలో మార్పులు సంభవిస్తుంటాయి. వాతావరణం వేడిగా ఉన్న సమయంలో ఈ మార్పులు అధికంగా ఉంటాయి. దీంతో ఉదయం వండిన కూరలు సాయంత్రం వరకే సద్ది వాసన వస్తుంటుంది. ఇలాంటి ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో నిల్వచేసి రెండు, మూడు రోజులు తినడం వల్ల వాటిల్లో పేరుకు పోయిన బ్యాక్టీరియా మన శరీరాన్ని ఇన్ఫెక్షన్‌కు గురి చేస్తుంది. వాంతులు, విరోచనాలు కావడంతోపాటు ఫుడ్ పాయిజన్ అయ్యి అవకాశం ఉంది. ఇది ఒక్కోసారి ప్రాణాలు పోయే వరకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.






