- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Immunity Power: ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా.. అయితే, రోగ నిరోధక శక్తి తగ్గినట్లే..!
కరోనా వచ్చిన తర్వాత నుంచి మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వచ్చిన తర్వాత నుంచి మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఇక అప్పటి నుంచి బయట ఫుడ్స్ తీసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ సరైన విధంగా ఉంటేనే మనం అన్ని పనులను చేసుకోగలం. అలాగే, ఇది తగ్గినప్పుడు నీరసం అవుతాము. రోగ నిరోధక శక్తీ బలంగా ఉన్నప్పుడే కరోనా లాంటి ఎన్ని భయంకర మహమ్మారిలు వచ్చినా తట్టుకోగలుతాము. కాబట్టి, ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందించే పోషకాహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఫ్రూట్స్ , విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటారు. ఇది కొంత వరకు మంచిదే కానీ .. మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి ( immunity power ) అనేది తెల్లరక్తకణాల నుంచి తయారవుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. అధిక ఒత్తిడితో బాధపపడే వారికి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వలన తెల్ల రక్తకణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పుడు జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. అలాగే, అదే పనిగా జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. ఇది కూడా రోగనిరోధక శక్తిని సూచిస్తుంది. తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గి తరచుగా జబ్బు పడుతూ ఉంటే ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ను తీసుకోవాలి. చిన్న పనులు అలిసిపోతున్నారంటే .. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వలనే గ్రహించండి.
శరీరానికి తగిలిన గాయాలు ఆలస్యంగా తగ్గుతాయి. దీనికి గల ముఖ్య కారణం తక్కువ రోగనిరోధక శక్తి. చర్మాన్ని తొందరగా ఉత్పత్తి చేయకుండా ఆలస్యం చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. ఎక్కువగా కీళ్ళ నొప్పి వస్తుంటే.. అది కూడా ఇమ్యూనిటీ పవర్ ఉందని గుర్తు చేస్తుంది. కాబట్టి, ఇలా మీ శరీరంలో కూడా కనిపిస్తే లేట్ చేయకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ని తీసుకోండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృ ధృవీకరించడం లేదు.






