Chanikya Nithi: మీ స్నేహితుల్లో ఇలాంటి వారు ఉన్నారా? పాము కంటే డేంజర్!

by Yella Dhawani Reddy |

ఆచార్య చాణక్యుడికి భారతదేశ చరిత్రలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.

Chanikya Nithi: మీ స్నేహితుల్లో ఇలాంటి వారు ఉన్నారా? పాము కంటే డేంజర్!
X

దిశ, వెబ్ డెస్క్: ఆచార్య చాణక్యుడికి భారతదేశ చరిత్రలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. మౌర్యుల పరిపాలనా కాలంలో చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణ్యుడిని 'కౌటిల్యుడు' అని కూడా అంటారు. ఇక చాణక్యుడు.. రాజకీయాలు, ఆరోగ్యం, వ్యాపారం, వివాహ జీవితం, సమాజం, నైతిక విలువలు, ఆర్థిక అంశాలతో పాటు జీవన విధానాలపై ఎన్నో నీతి సూత్రాలు చెప్పారు. మనిషి ఎదిగేందుకు ఆయన చెప్పిన ఈ నీతి సూత్రాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. నేటి తరంలో కూడా చాలా మంది ఆయన చెప్పిన మాటలు పాటిస్తుంటారు. అయితే, జీవితంలో ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి? ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.. చాణక్య నీతిలో తెలిపారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనిషి ప్రతి దశలోనూ స్నేహితులు తప్పనిసరిగా ఉంటారు. మన జీవితం సన్మార్గంలో వెళ్లేందుకు మంచి స్నేహితులు ఎంతగానో సహయపడుతారు. 'ఒక వ్యక్తి ముఖంగా అద్దంలో ప్రతిబింబించినట్లే అతడి వ్యక్తిత్వం అనేది అతడి స్నేహితుల ఎంపికలో ప్రతిబింబిస్తుంది' అని చాణక్య నీతి సూక్తులలో చెప్పారు. అందుకే స్నేహితులను ఎంచుకోవడం అంటే జీవిత మార్గాన్ని ఎంచుకున్నట్లే అని ఆచార్య చాణక్యుడు తెలిపారు. అలాగే స్నేహితులను ఎంచుకునే విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలని సూచించారు. జీవితంలో నిజమైన స్నేహితుడు దొరికితే జీవితం మెరుగుపడుతుందని, అదే తప్పుడు వ్యక్తులతో సహవాసం చేస్తే మాత్రం జీవితం మొత్తం చిన్నాభిన్నం అవుతుందని చెప్పాడు. అయితే చెడు లక్షణాలు కలిగిన స్నేహితులు పాముల వంటివారని, అలాంటి వారు మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదాన్ని బహుమతిగా ఇస్తుంటారని హెచ్చరించారు.

ఇక ఇలాంటి వారిని గుర్తించేందుకు పలు సలహాలు కూడా ఇచ్చాడు చాణక్యుడు. కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, మోసం వంటి గుణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే, కొంతమంది మనసులో విషం నింపుకుని బయటికి మంచిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిని గుర్తిస్తే వెంటనే వారికి దూరంగా ఉండాలన్నారు. అలాంటి వారిని చాణక్యుడు విషపూరితమైన పాములతో పోల్చారు. అలాగే, తమను పెంచిన తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేయని వారిని, తల్లిదండ్రులను అవమానించే వారిని చాణక్యుడు అత్యంత దుర్మార్గులుగా అభివర్ణిస్తారు. ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరి జీవితాన్ని కూడా మంచి మార్గంలో వెళ్ళనివ్వరని తెలిపారు. చాణక్యుడి నీతి ప్రకారం మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులు, భార్యలను, పిల్లలను పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం జీవించేవారు పాముల వంటివారని పేర్కొన్నారు. అలాంటి వారితో స్నేహం చేయడం మీ అభివృద్ధికి అడ్డుకట్టే అవుతుందన్నారు. జీవితంలో న్యాయం, నిజాయితీకి విలువ ఇవ్వని వారితో స్నేహం చేస్తే అవి మీ జీవితాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తాయని చాణక్యుడు చెప్పాడు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని స్నేహం చేస్తే జీవితంలో సంతోషంగా ఉండొచ్చు.

Next Story