- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fear: " భయంకరమైన ఆలోచనలు " మిమ్మల్ని భయపెడుతున్నాయా .. అయితే, ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..!
మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే భయపడతారు

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే భయపడతారు. ఒక్కోసారైతే భయంకరమైన ఆలోచనలోకి ( Terrible Thoughts ) వెళ్ళిపోతారు. ఆ తర్వాత డిప్రెషన్ కు గురవుతారు. ఇక ఏ పని చేయాలనుకున్నా.. కూడా మనిషి ఒక చోట .. మనసు ఒక చోట ఉంటుంది. ఎవరు పిలిచినా పట్టించుకోరు , ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆలోచన నుంచి ఒక్కసారిగా బయటపడాలంటే కొంచం కష్టంగానే ఉంటుంది. అలాంటి సమయంలో ఈ విధంగా చేయండి. ఇలా చేయడం వలన ఎంత భయంకరమైన ఆలోచనలైనా .. మిమ్మల్ని ఏమి చేయలేవు .. సులభంగా బయట పడొచ్చు. మరి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఎప్పుడైతే మీతో మీరు కంఫర్ట్ గా ఉంటారో .. మీకు వచ్చిన సమస్యలన్నింటిని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లెమ్ మీరే .. సొల్యూషన్ కూడా మీరే .. కాబట్టి, మీరు ముందుగా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకంటే సరిపోతుంది. మిమల్ని ఏవైతే భయపెడుతున్నాయా .. వాటినే ప్రశ్నించాలి? అసలు మీరు నన్ను ఎందుకు భయపెడుతున్నారు ? అని .. అప్పుడు మీకు మీరుగా ఆలోచిస్తే అర్ధమవుతుంది. నేను భయపడుతుంది .. నా నెగిటివ్ ఆలోచన వలన అని ..! ముందు వీటిని మీ నుంచి దూరం చేస్తే.. మీరు నార్మల్ అవ్వొచ్చు.
ఒక నిముషం ఆగి ఏమీ కాదు, నాకు భయం ( Fear ) లేదు… అని మీకు మీరే మూడు సార్లు చెప్పుకోండి. అలానే రోజుకి ఒక 20 నిముషాలు వాకింగ్ చేయడం లేదా 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తూ ఉండండి. దీని వలన మీరు ఆలోచనా విధానం మారుతుంది.
పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే, మీకు ప్రశాంతత దొరుకుతుంది. అలాగే, లేని పోని భయాలు కూడా తొలగిపోతాయి. మీ ఖాళీ సమయంలో స్నేహితులను కలుస్తూ ఉండండి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి.
Read More..
World sleeping day: నిద్రకు ఓ దినోత్సవం ఉందని మీకు తెలుసా? దీని ప్రత్యేకత ఏంటంటే?






