- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎకో టాయిలెట్స్ నిర్మించి.. బడి పిల్లల బతుకు మార్చారు.!
ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ముందుకొచ్చారు ఇద్దరు స్నేహితులు

దిశ, ఫీచర్స్: పేరుకు పెద్ద దేశం మనది. కానీ.. అర్జెంటుగా మూత్రం వస్తే వెళ్లడానికి పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు. ఇక అమ్మాయిల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయం. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ముందుకొచ్చారు ఇద్దరు స్నేహితులు.
ఇద్దరు మిత్రుల కృషి..
అది తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నెల్లివాసల్ గ్రామం. అక్కడొక ప్రభుత్వ పాఠశాల ఉంది. అది అటవీ ప్రదేశంలో ఉండటం వల్ల పిల్లలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనేవారు. స్కూల్లో టాయిలెట్స్ లేక బయటే విసర్జన చేసుకోవాల్సి వచ్చేది. దీంతో క్యాంపస్‌లో చెడు వాసనొచ్చేది. అది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపింది. దీనిని గమనించిన ఆర్కిటెక్ట్ బర్నాలా మైఖేల్.. అతని ఫ్రెండ్ విష్ణుప్రియ ఒక పరిష్కారం చూపెట్టారు. తక్కువ ఖర్చుతో పర్యావరణ హితమైన టాయిలెట్లను నిర్మించి స్కూల్లోని 80 మంది పిల్లల జీవితాన్ని మార్చేశారు ఆ ఇద్దరు స్నేహితులు.
ప్రాజెక్ట్ వెనక కథ..
స్కూల్లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి వేరొక కారణం కూడా ఉంది. సరైన బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ఒక చిన్నారి అనారోగ్య సమస్యలతో చనిపోయిందనే వార్త డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అయిన విష్ణుప్రియను కలచివేసింది. కొద్దిరోజుల పాట ఆ వార్త మైండ్లో మెదులుతూనే ఉండేది. అప్పటికే ఆమె "మీల్" అనే డాక్యుమెంటరీ మీద వర్క్ చేస్తూ వ్యర్థాల నిర్వహణకు పరిష్కార మార్గాల కోసం ప్రయత్నిస్తోంది. ఆ ప్రాజెక్టులో ఆర్కిటెక్ట్ అయిన బర్నాలా మైఖేల్ చేరాడు. ఇద్దరు కలిసి పర్యావరణం, నీటి కొరత, ఆరోగ్య పరిరక్షణ మీద పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే నెల్లవాసల్ స్కూల్‌ను ఎంచుకున్నారు.
ఇబ్బందులు ఎదురైనా..
నెల్లివాసల్ స్కూల్ పరిస్థితి ఏంటంటే.. అక్కడొక టాయిలెట్ మాత్రమే ఉంది. అదికూడా కేవలం టీచర్లకు మాత్రమే.? మరి విద్యార్థులకు..? ముఖ్యంగా బాలికల పరిస్థితి ఏంటి అని ఆలోచించారు మైఖేల్, విష్ణుప్రియ. అధికారులేమో నిధులు సేకరించలేని దీనస్థితిలో ఉన్నారు. ప్రజా ప్రతినిధులేమో పట్టించుకోలేదు. ఎవరైనా చేయడానికి ముందుకొస్తే.. ఆ పర్మీషన్.. ఈ పర్మీషన్ అని నానా సమస్యలు సృష్టించేవాళ్లు. ఎవరెంత ఇబ్బంది పెట్టాలని చూసినా.. నెల్లివాసల్ స్కూల్లో విద్యార్థుల కోసం టాయిలెట్ కట్టి తీరాలని సంకల్పించారు వీళ్లిద్దరు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి పర్మీషన్ తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.
మూడు టాయిలెట్స్..
ఈ ప్రాజెక్ట్ కోసం టీమ్ కక్కూస్ వలంటీర్లు క్రౌడ్ ఫండింగ్ చేశారు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఫెరో సిమెంట్ టెక్నిక్‌ను దీనికోసం ఉపయోగించారు. పాలీ కార్బోనేట్ షీట్లు ఉపయోగించి సహజ కాంతి పడేలా దీనిని డిజైన్ చేశారు. బయటి దృశ్యం కనిపించేలా పాలీ కార్బోనేట్ షీట్స్ పనిచేస్తాయి. వ్యర్థాల నిర్వహణకు లీచ్ పిట్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా వాడారు. నీళ్లు గోడల ద్వారా భూమిలోకి వెళ్తాయి. ఘన వ్యర్థాలు మట్టిలో మార్పు చెంది గార్డెన్ ఎరువుగా మారతాయి. ఇలా మొత్తం రూ.2.5 లక్షల ఖర్చుతో ఓపెన్ బాత్ ఏరియా పద్ధతిలో మూడు టాయిలెట్స్ నిర్మించారు.






