ఆ రాతి పురుషాంగం దేనికి సంకేతం?

by Dishanational2 |
ఆ రాతి పురుషాంగం దేనికి సంకేతం?
X

దిశ, ఫీచర్స్ : అది మే 19, 2023. వాయువ్య స్పెయిన్‌లోని రియా డి విగో ఈస్ట్యూరీ అనే ఒక పురాతన కోట ప్రాంతం. విధుల్లో భాగంగా ఆర్కియాలజిస్టులు అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. కాసేపటి తర్వాత తవ్వకాల్లో నిమగ్నమై ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారికి ఆరు అంగుళాలు కలిగిన అద్భుతమైన కళాఖండం కనిపించింది. అది అచ్ఛం మానవ పురుషాంగంలానే ఉంది. దీంతో అనేక సందేహాలు మొదలయ్యాయి. మధ్యయుగ స్పెయిన్‌లో ఈ వస్తువు ఉపయోగం ఏమిటి? అదొక శృంగార ప్రేరేపిత సాధనమా? అసలు దేనికి సంకేతం?

ఆర్కియాలజీ సహకార సంస్థ అయిన అర్బోర్ ఆర్కియోలోక్సియాతో కలిసి పనిచేస్తున్న రావస్తు శాస్త్రవేత్తలు స్పెయిన్‌లోని టోర్రే డి మీరా (Tower of Meira)వద్ద దీనిని కనుగొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఇది మోయానా మునిసిపాలిటీలో మధ్యయుగ కోట యొక్క ప్రదేశం. ఈ సైట్ రియా డి విగోకు ఎదురుగా కొండపై ఉంది. 15వ శతాబ్దం చివరిలో రియా డి విగోలో స్పానిష్ ప్రభువులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చెలరేగాయి. దీని ఫలితంగా 1476లో కూల్చివేయబడిన మీరా టవర్‌తో సహా చాలా కోటలు నాశనమయ్యాయి. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం ఆర్కియాలజిస్టులు 500 ఏళ్ల తర్వాత టవర్ శిథిలాలను కనుగొనడానికి తవ్వకాలు జరుపుగుతున్నారు. ఇందులో భాగంగా బయటపడ్డ వాటిలో కొన్ని రాతి పురుషాంగాలతోపాటు ఇతర అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయి. అయితే రాక్ పెనిస్ దేనికి సంకేతం అనే విషయంపైనే పరిశోధకులు ఆసక్తి కనబర్చారు. ఈ సందర్భంగా అనేక అభిప్రాయ భేదాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సదరు రాతి పురుషాంగాలు మధ్య యుగంలో ఆయుధాలను పదును పెట్టడానికి ఉపయోగపడిందని కొందరు భావిస్తుండగా, అప్పట్లో అదొక సెక్స్‌టాయ్‌గా, మగతనానికి సంకేతంగా ఉపయోగించి ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు. ‘‘కారణమేదైనా కావచ్చు కానీ ఇదొక అసాధారణమైన ఇంట్రెస్టింగ్ వస్తువు హింస, ఆయుధాలు, మగతనం మధ్య సంబంధానికి గుర్తు కావచ్చు. మధ్య యుగం నాటి చిహ్నాలు నేటి మన సంస్కృతిలోనూ ఉన్నాయి’’ అంటున్నారు ఆర్కియాలజిస్టు డారియో పెనా-పాస్కువల్. అయితే చారిత్రకమైన రోమన్ లేదాసెల్టిక్ ప్రదేశాలలో పెనిస్‌ను పోలిన వస్తువులు చాలా సాధారణం. కానీ మధ్యయుగ ఐరోపాలో వీటిని కనుగొనడమే అరుదైన ఆశ్చర్యకరమైన విషయమని పేర్కొన్నారు.

Also Read:

అపరిచితులతో భార్యల శృంగారం.. దగ్గరుండి పంపిస్తున్న భర్తలు.. ఏకంగా ఏడుసార్లు సెక్స్

ఈ లక్షణాలుంటే చాలు.. భవిష్యత్తులో ధనవంతులే!

Next Story