మియావ్.. భౌ భౌ శబ్దాలకు అర్థమేంటో తెలుసా..? పిల్లులు, కుక్కుల భాషను ఈజీగా అర్థం చేసుకుంటున్న ఏఐ

by Javid Pasha |

మియావ్.. భౌ భౌ శబ్దాలకు అర్థమేంటో తెలుసా..? పిల్లులు, కుక్కుల భాషను ఈజీగా అర్థం చేసుకుంటున్న ఏఐ

మియావ్.. భౌ భౌ శబ్దాలకు అర్థమేంటో తెలుసా..? పిల్లులు, కుక్కుల భాషను ఈజీగా అర్థం చేసుకుంటున్న ఏఐ
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు అనేక రంగాల్లో అద్భుతాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక పనులు, సేవలు సులభతరం అవుతున్నాయి. ఏఐ ఆధారిత డివైజ్‌లు, హ్యుమనాయిడ్ రోబోట్స్ అయితే పలు విషయాల్లో మానవులకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు పిల్లులు, కుక్కులు వంటి జంతువుల శబ్దాలను, ప్రవర్తనలను విశ్లేషించడం ద్వారా ఏఐ సాంకేతికత వాటి భావోద్వేగాల(Animal language)ను, అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మెరుగు పరుచుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.

మియావ్ టాక్ (MeowTalk) వంటి యాప్‌లు పిల్లుల ‘మియావ్’ శబ్దాలను రికార్డ్ చేసి, వాటిని AI టెక్నాలజీ ద్వారా ఎనలైజ్ చేసి, పిల్లి ఆకలితో ఉందా? ఆందోళనగా ఉందా? ఆనందంగా ఉందా లేదా ఒత్తిడిలో ఉందా? వంటి భావోద్వేగాలను గుర్తిస్తాయి. ఈ యాప్ పిల్లి, కుక్కలు పెంచుకున్న యజమానులకు వాటితో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది పిల్లి శబ్దాలను మానవ భాషలోని నిర్దిష్ట భావాలుగా అనువదిస్తుంది. ఉదాహరణకు, ‘నేను సంతోషంగా ఉన్నాను’ లేదా ‘నాకు ఆహారం కావాలి’ వంటి భావాలను తెలియజేస్తుంది.

ఇక FluentPet బటన్లు వంటి సాంకేతికతలు కుక్కలు, పిల్లులు తమ అవసరాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే టూల్స్‌గా ప్రసిద్ధి చెందాయని నిపుణులు చెబుతున్నారు. ఈ బటన్లు నిర్దిష్ట శబ్దాలు లేదా పదాలను రికార్డ్ చేస్తాయి. పెంపుడు జంతువులు వాటిని నొక్కడం ద్వారా తమ ఆలోచనలను లేదా అవసరాలను తెలియజేస్తాయి. ఉదాహరణకు, కుక్క ఫుడ్ కోసం ఒక బటన్‌ను నొక్కవచ్చు లేదా గేమ్ ఆడాలనుకుంటే మరొక బటన్‌ను నొక్కవచ్చు. అయితే AI ఆధారిత టెక్నాలజీ ఈ బిహేవియర్స్‌ను విశ్లేషించడం వల్ల పిల్లలు, కుక్కల ఉద్దేశాలను మరింత కచ్చితంగా అర్థం చేసుకోవడంలో యజమానులకు సహాయపడుతుంది. అంతేకాకుండా పెంపుడు జంతువుల సంభాషణ(Conversation with pets)ను మరింత డీప్‌గా, మీనింగ్ ఫుల్‌గా విశ్లేషించడం ద్వారా వాటి సంరక్షణను మెరుగుపరుస్తుంది.

Next Story