చలికాలంలో జుట్టు రాలుతోందా..? ఇదిగో చక్కటి చిట్కా!

by Javid Pasha |

చలికాలంలో జుట్టు రాలుతోందా..? ఇదిగో చక్కటి చిట్కా!
X

దిశ, ఫీచర్స్ : చలికాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో తలలో చుండ్రు పెరిగిపోవడం, జుట్టు రాలడం కూడా ఒకటి. దీని నుంచి బయటపడటానికి రకరకాల షాంపులు వాడుతుంటారు కొందరు. హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేసుకుంటారు మరికొందరు. అయితే పైసా ఖర్చులేని ఒక చక్కటి పరిష్కారం ఉందంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అదే మెంతులను ఉపయోగించుకోవడం. అదెలాగో చూద్దాం.

వంటకాల్లో ఉపయోగించే ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాల్లో మెంతులు(Fenugreek seeds) తప్పక ఉంటాయి. అయితే వీటిని ఆహారంలో భాగంగానే కాకుండా వివిధ రూపాల్లో ఉపయోగించడం వల్ల సహజంగానే జుట్టు రాలడాన్ని 80% వరకు తగ్గిస్తాయి. ఎందుకంటే ఇవి ప్రోటీన్లు, ఐరన్ వంటి సహజ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. రాలడాన్ని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుతాయి. చుండ్రును నియంత్రిస్తాయి. జుట్టును మందంగా పెరిగేలా, అందంగా మెరిసేలా చేస్తాయి. అందుకోసం రాత్రిపూట కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం మెత్తని పేస్ట్‌గా రుబ్బి స్కాల్ప్‌(scalp)పై 30 నిమిషాలు పట్టించి, తర్వాత కడిగేస్తే చాలు. ఈ సింపుల్ హోమ్ రెమెడీతో మీ జుట్టు ఆరోగ్యం, అందం రెట్టింపవుతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story