- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్:
మేడం.. నా వయసు 52 సంవత్సరాలు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఈ మధ్య 32 సంవత్సరాల వయసు గల అమ్మాయితో పరిచయం అయింది. ఒంటరిగా ఉంటుంది. తనకి ఇద్దరు పిల్లలు. నాతో చనువుగా ఉంటుంది. మీరే నాకు ఏదైనా దారి చూపాలి సార్ అని అంటోంది. తనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు అడిగి తీసుకుంటుంది. నేను కూడా సహాయం చేస్తున్నాను. కానీ నాలో ఒక బాధ మొదలైంది. నన్ను అమితంగా ప్రేమించే భార్య, పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలతో గొడవ అవుతుందేమోనని భయంగా ఉంది. నేను ఆమెతో కలిస్తే ఏదైనా వ్యాధి సంక్రమిస్తుందేమోనని ఆలోచిస్తున్నా. దీంతో రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. నన్నేం చేయమంటారు ?
- రఘుకిరణ్, విజయవాడ
జవాబు : బిడ్డ వయసు ఉన్న అమ్మాయి.. భర్త తోడు లేని అమ్మాయి.. మీలో తండ్రిని, అన్నను చూసుకుంటుందని ఎందుకు అనుకోరు ? ఆమెకు దూరంగా ఉండండి. మనసులో ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని దుర్బుద్ధితోనే మీరు సాయం చేస్తున్నారు. నిస్సహాయ ఒంటరి స్త్రీలను చూస్తే పురుషులలో కొందరికి ఈ రకమైన భావం, తక్కువ బుద్ధి ఉంటాయి. ఉద్ధరిద్దాం అనుకుంటారు కానీ.. వాళ్లలో స్వార్థం వల్ల ఒంటరి స్త్రీలకు దగ్గర కావడానికి చూపుతారు. మీకు ఆడబిడ్డలు ఉన్నారు అని గుర్తు పెట్టుకోండి. ఒంటరి స్త్రీలు ఏం తిరుగుబోతులు కారు. భర్త లేకపోయినా నీతి, నిజాయితీ, నిబద్ధతలతోనే బతుకుతారు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. అవకాశవాదులు గోతికాడ గుంట నక్కలు మీలాంటి చంచల మనస్తత్వం ఉన్నవాళ్లే దుర్బుద్ధితో వాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఉంటారు. మీ జాగాలో మీరు ఉండండి. పైసలు అడిగితే ఇవ్వకండి. ఏమైనా ఉద్యోగం చేసుకొని బతకవచ్చన్న విషయం ఆమెకు స్పురింపజేయండి. ఒక సోదరుడిగాను, తండ్రిలాగాను ఆమెకు ఉద్యోగం ఇప్పించి మీరు హుందాగా పక్కకి తప్పుకోండి.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






