- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
35 రోజుల ఉచిత శిక్షణ ఆమె జీవితాన్నే మార్చేసింది.!
ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

దిశ, ఫీచర్స్: కర్ణాటకలోని గౌరీబిదనూర్‌కు చెందిన అంజలిదేవి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. బెంగళూరులోని ఎయిడెడ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసింది. ఆమె తండ్రి ఆటో డ్రైవర్. ఆదాయం నెలకు కేవలం రూ.6000 మాత్రమే. తక్కువ ఆర్థిక మార్గాలున్నప్పటికీ అంజలి పెద్ద కలగన్నది. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
ప్లేస్‌మెంట్ దొరకలేదు
చదువుల్లో యాక్టివ్‌గా ఉండటంతో బడి మాన్పించాలనే ఆలోచనెప్పుడూ చేయలేదు అంజలి పేరెంట్స్. తన టాలెంట్‌ను చూసి ఊర్లోని నాయకులు, యువత సాయం చేశారు. అలా కళాశాల వరకు రాగలిగింది. చేతిలో పైసా లేకపోవచ్చుగానీ అంజలి ఎప్పుడూ టాపర్‌గానే ఉండేది. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఊహించని సవాలు ఎదురైంది. అందరికంటే ముందే ఉంటుందనుకున్న అంజలికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దొరకలేదు. కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలని ఉద్యోగం కోసం ఎంతో ఎదురుచూసింది. కానీ జాబ్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
35 రోజుల ఉచిత శిక్షణ
ఐదుగురు పిల్లల్లో అంజలి పెద్ద కూతురు కాబట్టీ ఏదో ఒకరకంగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక డిప్లొమా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది. ఈ పని విద్యార్థులకు జ్ఞానాన్ని పంచేందుకు సంతోషాన్నిచ్చినప్పటికీ తన కెరీర్ పరంగా సరిపడే ఉద్యోగం దక్కలేదనే వెలితి ఉండేది. అలాంటి సమయంలోనే తనకు ఉన్నతి ఫౌండేషన్ పరిచయం అయ్యింది. అది 35 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం. అంజలికి వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది.
బ్రాడ్‌రిడ్జ్‌లో ఇంటర్న్‌షిప్
ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం, జీవన నైపుణ్యాలు వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చింది. ఒక నెల శిక్షణ తన బలహీనతలైన కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసంలో గణనీయమైన మార్పులు తెచ్చింది. మాతృభాష కన్నడ అయినప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. శిక్షణలో సంపాదించిన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం తనకు బ్రాడ్‌రిడ్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌లో ఇంటర్న్‌షిప్, శాశ్వత ఉద్యోగాన్ని సంపాదించేలా చేశాయి. విభిన్న కోడింగ్ భాషలను నేర్చుకోవడంలో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆమె సంకల్పం విజయవంతం చేసింది.
ఫ్యామిలీకి పెద్దదిక్కు
ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.ఇప్పుడు అంజలి నెలకు రూ. 40000 సంపాదిస్తోంది. కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతోంది. తమ్ముడు, చెల్లెళ్లకు మంచి విద్య అందేలా చూసుకుంటోంది. అంజలి లాంటి మూడు లక్షల మంది యువతకు ఉన్నతి ఫౌండేషన్ వృత్తిపరమైన జీవితంలో మార్గదర్శనం చేసింది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి 12 రాష్ట్రాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. అంజలిలాంటి ఆణిముత్యాలను గుర్తించి వారికి నైపుణ్యాలను అందించి, పోటీతత్వ మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలను సృష్టించే స్థాయికి తీసుకెళ్తోంది.






