సెక్స్ కాస్ట్యూమ్స్‌గా స్కూల్ యూనిఫామ్స్

by Harish |

దిశ, ఫీచర్స్: ఇంగ్లండ్‌లోని క్రూ టౌన్ సెంటర్‌ ‘సౌత్ చెషైర్ పాఠశాల’ విద్యార్థులు పార్లమెంట్ వెబ్‌సైట్‌లో పిటిషన్ వేశారు..Latest Telugu News

సెక్స్ కాస్ట్యూమ్స్‌గా స్కూల్ యూనిఫామ్స్
X

దిశ, ఫీచర్స్: ఇంగ్లండ్‌లోని క్రూ టౌన్ సెంటర్‌ 'సౌత్ చెషైర్ పాఠశాల' విద్యార్థులు పార్లమెంట్ వెబ్‌సైట్‌లో పిటిషన్ వేశారు. స్కూల్ యూనిఫామ్స్ శృంగార దుస్తులకు సంకేతంగా మారుతున్నాయని.. సెక్స్ షాపుల్లో వీటి అమ్మకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇవి పిల్లలపై లైంగిక వేధింపులకు కారణంగా మారుతున్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పిలుపునిస్తూ 570 మందికిపైగా పిటిషన్‌పై సంతకం చేశారు.

కాగా పోర్న్ వీడియోస్‌లో స్కూల్ యూనిఫామ్స్‌ అశ్లీలతతో నిండిపోతున్నాయని.. దయచేసి ఇలాంటి వినియోగాన్ని ఇల్లీగల్‌గా పేర్కొనాలని గవర్నమెంట్‌ను కోరారు విద్యార్థులు. ఇది తమకు అసౌకర్యంగా ఉంటుందని.. పైగా లైంగికంగా హద్దులు మీరడంలో తప్పులేదనే ఆలోచనను కలిగిస్తుందని వివరించారు. ఈ విషయంలో మార్పు కోరుకుంటున్నామని, తమకు నిజమైన సామాజిక న్యాయం కావాలన్నారు. కాగా స్కూల్‌కు చెందిన ఫెమినిజమ్ గ్రూప్ సభ్యులు స్వయంగా పిటిషన్ రూపొందించడం పై ఉపాధ్యాయులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. పాఠశాల దుస్తులపై హైపర్ సెక్సువలైజేషన్‌ను నిషేధించమన్న వారి ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

Next Story